బాలయ్య, కాజల్ కాంబోలో సినిమా తెరకెక్కకపోవడానికి కారణమేంటో తెలుసా?

స్టార్ హీరో బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించారనే సంగతి తెలిసిందే.అయితే బాలయ్య కాజల్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు.

 This Is The Major Problem For Balakrishna Kajal Combination Project Details Here-TeluguStop.com

అయితే బాలయ్య కాజల్ కాంబోలో సినిమా రాకపోవడానికి కాజల్ అగర్వాల్ ఆఫర్లను తిరస్కరించడమే కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాల కోసం దర్శకులు కాజల్ ను సంప్రదించారు.

అయితే ఆ సమయంలో కాజల్ అగర్వాల్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం, ఇతర కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదు.అయితే రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.

కాజల్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.అయితే కాజల్ అగర్వాల్ త్వరలో మళ్లీ సినిమా ఆఫర్లతో బిజీ కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

కాజల్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినా గతంలోలా ఆమెకు ఆఫర్లు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది.ఆచార్య సినిమాలోని కొన్ని సీన్లలో కాజల్ నటించినా కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించారు.

కాజల్ సినిమాలకు దూరంగా ఉన్నా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు.ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలకు కాజల్ అగర్వాల్ లక్కీ హీరోయిన్ కావడం గమనార్హం.

Telugu Balakrishna, Kajal, Paisa Vasool-Movie

సినిమాల ద్వారా కాజల్ అగర్వాల్ దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు ఆస్తులు సంపాదించారని సమాచారం.కాజల్ అగర్వాల్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.కాజల్ తమిళం, హిందీ భాషల్లో కూడా పలు సినిమాలలో నటించినా తెలుగు సినిమాల ద్వారానే ఆమెకు మంచి గుర్తింపు దక్కింది.కాజల్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube