థర్డ్ ఎసి, ఎసి-3 ఎకానమీ కోచ్‌ల మధ్య తేడా ఏమిటో తెలుసా?

భారతీయ రైల్వేలు ప్రతి వర్గానికి అనుగుణంగా సౌకర్యాలను క‌లుగ‌జేస్తున్నాయి.ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ లేదా స్లీపర్ వంటి కోచ్‌లు ఉండగా, ఇప్పుడు ప‌లు రైళ్లలో థర్డ్ ఏసీ తరహాలో ఏసీ-3 ఎకానమీ కోచ్‌ల‌ను అనుసంధానిస్తున్నారు.

 Third Ac And Ac 3 Economy Difference Know Why These Coaches, Ac 3, Railway , Ind-TeluguStop.com

మీరు ఎప్పుడో ఒక‌సారైనా ఎవ‌రినైనా ఏసీ-3 ఎకానమీ గురించి వివ‌రాలు అడిగి ఉంటారు.ఇప్ప‌డు దీనికి సంబంధించిన వివ‌రాలు తెలుసుకుందాం.ఏసీ-3 ఎకానమీ అంటే ఏమిటి? థర్డ్ ఏసీలోని ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో, ఈ కోచ్‌లోనూ అటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.ఏసీ-3 కోచ్‌లు ఉన్న రైలులో ఎకానమీ కోచ్‌లు ఉండ‌వు.అంటే ఒక విధంగా థర్డ్ ఏసీతో భర్తీ చేస్తారు.ఇది థర్డ్ ఏసీకి ఎలా భిన్నంగా ఉంటుందంటే.వాస్తవానికి ఏసీ-3 కొత్త కోచ్‌లకు ఏసీ- 3 ఎకానమీ అనే పేరు పెట్టారు.థర్డ్ ఏసీలో 72 సీట్లు ఉన్నా, ఏసీ-3 ఎకానమీలో 11 సీట్లు ఎక్కువగా ఉండ‌టాన్ని మీరు చూసే ఉంటారు.

ఇందులో 83 సీట్లు ఉంటాయి.ఇవి ప్రత్యేకంగా రూపొందించిన కోచ్‌లు.

వీటిలో చాలామందిప్రయాణించే విధంగా, వారికి మెరుగైన సౌకర్యాలు కూడా లభించే విధంగా రూపొందించారు.ఈ కోచ్‌ల ఇంటీరియర్ మునుపటి కంటే మెరుగ్గా ఉండడంతో పాటు ప్రతి ప్రయాణీకుడు ఏసీ ప్రయోజనం పొందేలా ప్రత్యేక శ్రద్ధ వ‌హించారు.

దీంతో పాటు కోచ్‌లోని ప్రతి వ్యక్తికి అనుగుణంగా లైట్ల ఏర్పాటు మొద‌లైన‌వి చేశారు.థర్డ్ ఎసి కోచ్‌లను సాధారణంగా బి1, బి2, బి3 మొదలైన వాటితో గుర్తించినట్లుగానే, ఎకానమీ కోచ్‌లను ఎం1, ఎం2, ఎం3 మొదలైన తీరులో గుర్తిస్తారు.

ఇప్పుడు ఈ కోచ్‌లు చాలా రైళ్లలో క‌నిపిస్తాయి.

Third Ac And Ac Economy Difference Know Why These Coaches

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube