తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్( Dasoju Sravan Kumar ) అన్నారు.పెట్టుబడుల వేదికను రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని తెలిపారు.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోతున్నారని దాసోజు విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి భాష గురించి కాదు భావం గురించి మాట్లాడుతున్నామని చెప్పారు.అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర గౌరవం పెంచే విధంగా మాట్లాడాలని సూచించారు.