బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న బిజెపి పెద్దలు మాత్రం టిడిపితో పొత్తుకు ఏమాత్రం సానుకూలంగా లేరు.
ఇక ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.ఆ తర్వాత ఏపీలోనూ ఎన్నికలు జరగనున్నాయి.
అయితే పొత్తులపై ఒక క్లారిటీ వస్తే బిజెపితో పొత్తు పెట్టుకుని దానిని ఏపీ ఎన్నికల వరకు కొనసాగించవచ్చని చంద్రబాబు భావించినా, ఆ ఆశ తీరేలా కనిపించడం లేదు.
![Telugu Amith Shah, Ap, Chandrababu, Modhi, Narendra Modi, Telangana, Telangana T Telugu Amith Shah, Ap, Chandrababu, Modhi, Narendra Modi, Telangana, Telangana T](https://telugustop.com/wp-content/uploads/2023/08/bjp-Telangana-elections-ap-elections-Narendra-Modi-Amith-shah.jpg)
ఈ నేపథ్యంలోనే పొత్తుల వ్యవహారంపై తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు.వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ( TDP ) ఒంటరిగానే పోటీ చేస్తుందని, బిజెపితో పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు బిజెపితో పొత్తు పెట్టుకునే సమయం దాటిపోయిందని, ఇక టిడిపి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ అంశంపై స్పందించారు.
బిజెపి, టిడిపి పొత్తు పెట్టుకుంటుందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.
![Telugu Amith Shah, Ap, Chandrababu, Modhi, Narendra Modi, Telangana, Telangana T Telugu Amith Shah, Ap, Chandrababu, Modhi, Narendra Modi, Telangana, Telangana T](https://telugustop.com/wp-content/uploads/2023/08/Telangana-elections-ap-elections-Narendra-Modi-Amith-shah-Kasani-Gnaneshwar.jpg)
ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టిడిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు.వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఏ ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే విషయంపై కమిటీ వేసామని, ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే విషయాన్ని కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు.తెలంగాణ టిడిపి అధ్యక్షుడు జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ) రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ టిడిపి పోటీ చేయాలని కోరుతున్నార కానీ, గెలిచే స్థానాలపై దృష్టి సారించాలని తాను సూచించినట్లుగా చంద్రబాబు తెలిపారు.
లీడర్ లేకపోవడం బీజేపీకి అనుకూలమైన అంశం అని, ఎన్డిఏ కు వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్తుంది అనేది వేచి చూడాలని చంద్రబాబు అన్నారు.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పై ప్రశంసలు కురిపించారు.