ఈ ఏడాది తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న దర్శకులు వీళ్లే..?

ప్రతి డైరెక్టర్ కెరీర్ లో ఫస్ట్ మూవీ ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.ఫస్ట్ మూవీ సక్సెస్ సాధిస్తే మాత్రమే మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది.

 These Tollywood Directors Got First Success In First Attempt, First Attempt , Fi-TeluguStop.com

ఈ ఏడాది కొంతమంది డైరెక్టర్లు తొలి ప్రయత్నంలోనే విజయాలను సొంతం చేసుకున్నారు.బుచ్చిబాబు సానా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలతో ఉప్పెన సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా కలెక్షన్లను సాధించింది.

తన టాలెంట్ తో తొలి ప్రయత్నంలోనే బుచ్చిబాబు సానా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల నాంది సినిమాను తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు.

వరుస ఫ్లాపులతో కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నరేష్ కు ఈ సినిమాతో సక్సెస్ లభించింది.ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్లలో హసిత్ గోలీ కూడా ఒకరు.

రాజ రాజ చోర క్రైమ్ కామెడీగా తెరకెక్కి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Telugu Attempt, Hasith Goli, Kishpre Reddy, Srikraram, Uppena-Movie

పొట్ట చెక్కలయ్యే కామెడీ రాజ రాజ చోర సక్సెస్ సాధించడానికి కారణమైంది.ఏక్ మినీ కథ సినిమాతో కార్తీక్ రాపోలు విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.అడల్ట్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను అందించింది.

ర్శకుడు కిషోర్ రెడ్డి శర్వానంద్ హీరో శ్రీకారం సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించారు.ఓటీటీలో సైతం శ్రీకారం సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Telugu Attempt, Hasith Goli, Kishpre Reddy, Srikraram, Uppena-Movie

ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లు తెలుగులో సినిమా బండి పేరుతో ఒక సినిమాను నిర్మించారు.ఓటీటీలో రిలీజైన సినిమా బండి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఈ సినిమాలతో పాటు మరికొందరు దర్శకుల ప్రయత్నాలు మెప్పించినా సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించకపోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube