స్పేస్ పెన్ తయారీ వెనుక ఉన్న రహస్యం ఇదే..!

మీకు స్పేస్ పెన్ గురించి తెలుసా.? అసలు ఆ పేరు ఎప్పుడన్నా విన్నారా.సినిమాల్లో విని ఉంటారు కదా.మరి ఎప్పుడన్నా అసలు స్పేస్ పెన్ అంటే ఏంటి.? ఆ పెన్ ఎలా తయారు చేస్తారు అనే విషయాల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా.? అందుకే మీకోసం స్పేస్ పెన్ గురించిన వివరాలను తెలియచేయబోతున్నాము.ఇంతకీ స్పేస్ పెన్ అంటే ఏంటి అనుకుంటున్నారు.ఇది వ్యోమగాముల పెన్ అన్నమాట.ఈ పెన్ ఏ కోణంలోనైనా, ఏ ఉష్ణోగ్రతలోనైనా చివరికి జీరో గురుత్వాకర్షణలోనైనా గాని పనిచేస్తుందట.మొదట్లో ఈ స్పేస్ పెన్స్ అందుబాటులోకి రాకముందు పైసా ఖర్చులేకుండా స్పేస్ లో పెన్సిల్‌ లను వాడేవారు.

 These Are The Secrets Behind The Making Of Space Pen, Space Pens, Paul C. Fisher-TeluguStop.com

ఆ తరువాత అంతరిక్ష సంస్థ అయిన నాసా స్పేస్ పెన్నును అభివృద్ధి చేసింది.

ఈ స్పేస్ పెన్ కోసం చాలా డబ్బులు నాసా ఖర్చు పెట్టింది అని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ నిజానికి ఇల్లినాయిస్ లోని ఫిషర్ పెన్ కంపెనీ వ్యవస్థాపకుడు పాల్ సి.ఫిషర్ తొలి ఫిషర్ స్పేస్ పెన్‌ను తన సొంత డబ్బులు 1 మిలియన్ దాకా ఖర్చు చేసి ఈ పెన్ తయారు చేసాడట.అదే పెన్ ను మనం ‘3 ఇడియట్స్‘ మూవీలో చూడొచ్చు.

ఇక్కడ మీకో డౌట్ రావచ్చు.సాధరణ పెన్ అంతరిక్షంలో ఎందుకు పని చేయదా అని.స్పేస్ లో బాల్ పాయింట్ లేదా జెల్ పెన్ పని చేయాలంటే గురుత్వాకర్షణశక్తి కూడా తప్పకుండా కావాలి.ఆ గురుత్వాకర్షణ శక్తి ఉంటేనే పెన్ను రీఫిల్ లోని ఇన్న ఇంకు కాగితంపై పడుతుంది.

Telugu Ballpointpen, Nasa Space Pen, Paul Fisher, Space Pens-Latest News - Telug

అందుకోసమే స్పేస్ పెన్నులోని బాల్ పాయింట్‌ను టంగ్‌స్టన్ కార్బైడ్‌ తో తయారుచేస్తారన్నమాట.అసలు గాలి అనేది చొరబడకుండా ఈ బాల్ పాయింట్‌ ను తయారు చేయడం పెన్ లోని సిరాపై ఎలాంటి ఒత్తిడి పడదు.అందువల్ల పెన్ లోనీ ఇంక్ బయటకు లీక్ అవ్వదు.ఇక ఈ స్పేస్ పెన్నులో వాడే సిరాని ప్రెషరైజ్డ్ ఇంక్ అంటారు.కేవలం ఈ ఇంక్ మనం వ్రాసేటప్పుడు మాత్రమే బయటకు వస్తుంది.పెన్ ను వాడని సమయంలో ఇందులోని ఇంక్ జిగటగా, రబ్బర్ సిమెంట్‌లా ఉంటుంది.

ఈ స్పేస్ పెన్‌ లు రాకముందు అంతరిక్ష సంస్థలు వివిధ రకాల పెన్సిల్‌ లను ఉపయోగించేవట.నాసా ఒక మెకానికల్ పెన్సిల్‌ ని ఉపయోగించేది.

ఇకపోతే రష్యన్ వారు స్పేస్ లో మైనపు పెన్సిల్ వాడేవారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube