మామూలుగా సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు జరిగినప్పుడు హీరో హీరోయిన్లకు దర్శక నిర్మాతలకు చిన్నచిన్న ప్రమాదాలు జరగడం అన్నది కామన్.ఇలా గతంలో చాలామంది హీరోలకు హీరోయిన్లకు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే.
అలాంటప్పుడు కొందరు విశ్రాంతి తీసుకోగా మరికొందరు అలా దెబ్బలు తగిలినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా అలాగే సినిమాని కంటిన్యూ చేశారు.కొందరు హీరోలు ప్రాణాలను రిస్కులో పెట్టిన కూడా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.
అలా టాలీవుడ్( Tollywood ) లో కూడా కొందరు హీరోలు దెబ్బలు తగిలినప్పటికీ వాటిని లెక్కచేయకుండా సినిమాలలో నటించారు.
కానీ ఆ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయి.ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఆ సినిమాలు ఏవి అన్న విషయానికి వస్తే.టాలీవుడ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) హీరోగా నటించిన వారియర్, స్కంద( Skanda ) సినిమాలసమయంలో కాలుకి అలాగే మెడ భాగంలో ఫ్రాక్చర్ అయినప్పటికీ అలాగే సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు రామ్.
అలాగే విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) హీరోగా నటించిన డియర్ కామ్రేడ్( Dear Comrade ) సినిమాలో హీరో విజయ్ ట్రైన్ ఎక్కే సమయంలో అనుకోకుండా స్లిప్ అయ్యి కింద పడగా గట్టిగానే దెబ్బలు తగిలాయి.అయినా కూడా విజయ్ షూటింగ్ అలాగే పూర్తి చేసినప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
అలాగే అఖిల్( Akhil ) హీరోగా నటించిన ఏజెంట్ మూవీ సమయంలో హీరో అఖిల్ కి దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇద్దరికి గాయాలు అయ్యాయి.గాయాలు అయినప్పటికీ మూవీ కోసం చాలానే కష్టపడ్డారు.అయినా కూడా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ప్రభాస్ బాహుబలి సినిమా( Prabhas Baahubali )లో నటిస్తున్న సమయంలో మోకాలికి గాయం అవ్వగా ఆ తర్వాత మోకాలు నొప్పిని భరిస్తూ రాధేశ్యామ్ ,ఆది పురుష్, సాహో సినిమాలు చేశాడు.కానీ ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.