Kriti Shetty: అప్పుడు అలా ఇప్పుడు ఇలా.. నాలుగు ప్లాపులకు తెగించేసిన కృతి శెట్టి?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులలో కొందరి మాటలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.సందర్భం బట్టి మాట మారుస్తూ ఉంటారు.

 Then And Now Like This Kriti Shetty Was Cut Off For Four Strokes-TeluguStop.com

ఇప్పుడు కృతి శెట్టి( Kriti Shetty ) కూడా అలాగే మాట మార్చింది.ఒకప్పుడు నీతి మాటలు చెప్పిన కృతి శెట్టి ఇప్పుడు తెగించేసింది.

పైగా ఈ మధ్య ఆమె సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఒకప్పటి ఆలోచనలను మార్చుకుంది.అలా ఉంటే సక్సెస్ కాదు అని ఇప్పుడు రూట్ మొత్తం మార్చేసింది.

మరి ఆమె తీసుకునే నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఉప్పెన సినిమాతో తెలుగు కుర్రాళ్ళందర్నీ ఫిదా చేసింది కృతి శెట్టి.

ఈ సినిమాలో బేబమ్మ( Bebamma ) పాత్రతో బాగా ఫిదా చేసింది.ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది.

హీరోయిన్ గా అడుగు పెట్టక ముందు బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో చేసింది ఈ ముద్దుగుమ్మ.చాలావరకు బాలీవుడ్( Bollywood ) అడ్వర్టైజ్మెంట్లలో చేసి ఆకట్టుకుంది.

ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టగా హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Kriti Shetty, Photoshoot, Tollywood-Movie

కొన్ని సినిమాలు సక్సెస్ అందించగా మరికొన్ని సినిమాలు నిరాశ కూడా పరిచాయి.అయినప్పటికీ కూడా ఈ అమ్మడికి అవకాశాలు బాగానే వస్తున్నాయని చెప్పాలి.అయితే ఈ మధ్య చేసిన సినిమాలలో చాలావరకు ఫ్లాప్ అనే టాక్ అందుకుంది.

దీంతో ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు నిరాశపరచడంతో తన ఆలోచన మొత్తం మార్చేసిందని.ముఖ్యంగా కంటెంట్ విషయంలో వేరే రూట్ కి వెళ్ళిపోతుందని తెలుస్తుంది.అదేంటంటే ఎప్పుడు లేని రేంజ్ లో కృతిశెట్టి బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి ఒక అడుగు ముందుకేసింది అని తెలిసింది.రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా బోల్డ్ కంటెంట్ చేసినంత మాత్రాన తప్పు కదా అంటూ కూడా తనకు తాను వత్తాసు పలుకుతుంది.

అంటే ఈ బ్యూటీ బోల్డ్ కంటెంట్ చేయడానికి సిద్ధమైనందుకే ఇలా కామెంట్ చేసిందని తెలుస్తుంది.

Telugu Kriti Shetty, Photoshoot, Tollywood-Movie

అంతేకాకుండా దర్శకులు బోల్డ్ కంటెంట్( Directors bold content ) తో వచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం కండిషన్స్ పెట్టకుండా ఓకే అనటానికి సిద్ధంగా ఉందట.అయితే గతంలో మాత్రం ఒక సినిమాలో కేవలం లిప్ కిస్ కే బాగా కండిషన్ లు పెట్టిందని తెలిసింది.కానీ ఇప్పుడు ఏమాత్రం మొహమాటం పడకుండా ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా నేరుగా ఒప్పేసుకుంటుంది అని తెలిసింది.

దీంతో ఈ అమ్మడికి బాగా ట్రోల్స్ కూడా ఎదురవుతున్నాయి.అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటంతో అందాలపరంగా కూడా బాగా షో చేస్తుంది.

తనలో కూడా గ్లామర్ షో చేయడంలో టాలెంట్ ఉందని చూపిస్తుంది.నిత్యం ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఓ సినిమాలో అవకాశం అందుకుందని తెలిసింది.ఇక ఈ సినిమాలోనైనా మంచి సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube