వెస్టిండీస్ సిరీస్ తిలక్ వర్మ కెరీర్ మార్చేసింది..ఆసియా కప్ లో చోటు..!

ఆసియా కప్ 2023( Asia Cup 2023 ) పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరుగనున్న సంగతి తెలిసిందే.ఆసియా కప్ మొదటి మ్యాచ్ నేపాల్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఆరంభం అవ్వనుంది.

 The West Indies Series Changed Tilak Verma's Career..a Place In The Asia Cup..!-TeluguStop.com

సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగునుంది.భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ టోర్నీలో పాల్గొనే దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ జట్లు ఇప్పటికే తమ టీంలను ప్రకటించాయి.భారత్ మాత్రం ఇంకా టీం వివరాలు వెల్లడించలేదు.

Telugu Asia Cup, Ishan Kishan, Kl Rahul, Latest Telugu, Pakistan, Shreyas Iyer,

టీమ్ వెల్లడించకపోవడానికి కారణం ఆటగాళ్ల గాయాల సమస్య.కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్( KL Rahul, Shreyas Iyer ) ఫిట్నెస్ రిపోర్ట్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎదురుచూస్తోందని సమాచారం.ఈ వారంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆసియా కప్ ఆడే జట్టును ప్రకటించే అవకాశం ఉంది.ఆసియా కప్ ఆడే జట్టులో హైదరాబాద్ కుర్రాడైన తిలక్ వర్మకు( Tilak Varma )చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్రికెట్ ఆటగాళ్ల ఫిట్నెస్ పరంగా.ఇటీవలే విండీస్ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన కారణంగా తిలక్ వర్మకు జట్టులో అవకాశం రావచ్చు.విండీస్ సిరీస్( West Indies ) లో ఐదు ఇన్నింగ్స్ లలో 57.33 సగటుతో 173 పరుగులు చేశాడు.ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.మరొకవైపు ఒక వికెట్ ను కూడా తీశాడు.సీనియర్లు చేతులు ఎత్తేస్తే తిలక్ వర్మ క్రీజులో నిలబడి పరుగులు చేశాడు.

Telugu Asia Cup, Ishan Kishan, Kl Rahul, Latest Telugu, Pakistan, Shreyas Iyer,

కాబట్టి ఈ విషయాలను పరిశీలించిన బీసీసీఐ ఆసియా కప్ లో తిలక్వర్మను ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ గా దింపాలని ఆలోచిస్తుంది.పైగా మిడిల్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ ప్రస్తుతం ఎవరూ లేరు.కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కే అవకాశం ఉంది.

ఇక భారత జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది.మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ సాధిస్తే నాలుగో స్థానంలో, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ సాధిస్తే 5వ స్థానంలో, హార్దిక్ పాండ్యా ఆరవ స్థానంలో, రవీంద్ర జడేజా ఏడవ స్థానంలో వచ్చే అవకాశం ఉంది.

శ్రేయస్, రాహుల్ లలో ఏ ఒక్కరు ఆడకున్న తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయం.అలా కాకుండా ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ లతో తిలక్ వర్మకు గట్టి పోటీనే ఉంది.

బీసీసీఐ ఏం ఆలోచిస్తుందో తుది నిర్ణయం ఈ వారంలో వెల్లడిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube