తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం క్రమక్రమంగా ముదురుతోంది.బీఎల్ సంతోష్ రాకతో పొలిటికల్ వార్ మరింత ఆజ్యం పోశారు.
బీజేపీ సమావేశాలకు హాజరైన ఆయన మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
తనంటే తెలంగాణలో ఎవరికీ తెలియదన్న బీఎల్ సంతోష్ తన పేరును ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేశారని మండిపడ్డారు.బీఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్యానికి శాపమని విమర్శలు గుప్పించారు.
తెలంగాణ తల్లికి ద్రోహం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణను రియల్ ఎస్టేట్ ఏటీఎంగా మార్చుకున్నారని బీఎల్ సంతోష్ అన్నారు.
కేసీఆర్ కుటుంబం ప్రజాస్వామ్యానికి శాపమని ఆరోపించారు.