ఒక ఊరి దొర మరొక ఊరి పాలేరు అనే మాట తరచుగా పెద్దలు చెప్తుంటారు.స్థానబలం ఉన్నచోటే మనం గొప్పవాళ్లం.
సేమ్ ఇలాగే జరిగింది పలువురు సౌత్ టాప్ హీరోల విషయంలో.ఆయా భాషల్లోని నటులు మిగతా భాషల్లోని సినిమా పరిశ్రమల్లోకి వెళ్లి నటిస్తుంటారు.
అయితే కొందరు సక్సెస్ అయితే మరికొందరు అంతగా రాణించలేరు.అలాగే పలువురు సౌత్ టాప్ హీరోలు బాలీవుడ్ కు వెళ్లి తమ లక్ ని పరీక్షించుకున్నారు.
కానీ అనుకున్న స్థాయిలో పేరు సంపాదించలేకపోయారు.ఇంతకీ అక్కడికి వెళ్లి స్టార్ డమ్ సంపాదించని నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవి
తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజి క్రేజ్ ఉంది చిరంజీవికి.ఆయన హిందీలో ఆజ్ కా గూండా రాజ్, జెంటిల్మెన్ సినిమాలు చేశాడు.కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపు పొందలేదు.
వెంకటేష్
వెంకటేష్ కూడా బాలీవుడ్ లో అడుగు పెట్టినా సక్సెస్ కాలేదు.తక్దీర్ వాలా, అనారీలో నటించి మెప్పించలేక పోయాడు.
సుదీప్
ఈగ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు పొందాడు.అదే ఊపులో ఫూంక్, రణ్ అనే బాలీవుడ్ సినిమాల్లో నటించాడు.కానీ హిట్ కొట్టలేదు.
అరవింద స్వామి
సాత్ రంగ్ కే సప్నే, రాజా కో రాణి సే ప్యార్ హో గయా సినిమాల్లో నటించాడు అరవింద స్వామి.కానీ సక్సెస్ కొట్టలేదు.
పృథ్వీరాజ్ సుకుమారన్
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రాణీ ముఖర్జీతో కలిసి అయ్యా సినిమా నటించి ఫ్లాప్ కొట్టాడు.
త్రిష
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కట్టా మీఠా సినిమాతో త్రిష బాలీవుడ్ కు వెళ్లింది.కానీ ఆ సినిమా మంచి విజయాన్ని ఇవ్వలేదు.
శృతి హాసన్
శృతి హాసన్ లక్ మూవీతో బాలీవుడ్ కు వెళ్లింది.పలు సినిమాలు చేసింది.కానీ అంతగా గుర్తింపు పొందలేదు.
రామ్ చరణ్
మెగాస్టార్ కొడుకు జంజీర్ సినిమాలో నటించారు.కానీ హిట్ కొట్టలేదు.
తమన్నా
హిమ్మత్ వాలాతో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో మిల్కీ బ్యూటీ నటించినా సక్సెస్ కాలేదు.
రానా
రానా దమ్ మారో దమ్ సినిమాలో నటించారు.ఏ జవానీ హై దివానీ సినిమాలో కనిపించాడు.అయినా పెద్దగా పేరు రాలేదు.
భూమిక
సల్మాన్ ఖాన్ తో తేరే నామ్ సినిమాతో పాటు మరికొన్ని హిందీ సినిమాలు చేసింది.అయినా పెద్దగా పేరు రాలేదు.
అటు హన్సిక, జ్యోతి, శ్రేయ, రంభ సైతం పలు హిందీ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకోలేదు.