ఇండస్ట్రీ లో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం సహజం గా జరుగుతూనే ఉంటుంది.ఇది హీరోలా విషయం లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయం లో కూడా ఇలాంటిది జరుగుతూ ఉంటుంది… దిల్ రాజు ప్రొడ్యూసర్ గా, సతీష్ వేగేశ్న ( Satish Vegesna)డైరెక్షన్ లో వచ్చిన శతమానం భవతి సినిమాలో బంగార్రాజు అన్నిటికీ కంగారుపడే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది.
హీరో శర్వానంద్ ఫాదర్ క్యారెక్టర్ అది, అయితే ఈ పాత్ర ని సినిమాలో సీనియర్ నరేష్ (Naresh)చేశాడు.కానీ మొదట ఈ పాత్ర శివాజీ రాజా దగ్గరికి వెళ్లిందట ఆయన అప్పుడు మా ఎలక్షన్స్ లో బిజీ గా ఉండి ఈ క్యారెక్టర్ చేయకుండా వదిలేసుకున్నాడు.
ఈ సినిమా పెద్ద విజయం సాధించి నరేష్ పాత్రకి మంచి పేరు రావడం తో శివాజీ రాజా(Shivaji Raja) నేను ఈ పాత్ర చేసి ఉంటే బాగుండేది అని చాలాసార్లు బాధపడ్డాడట.
అలా ఒక్క క్యారెక్టర్ మిస్ అయితే ఏమవుతుందిలే అని నటులు అనుకుంటారు కానీ ఆ క్యారెక్టర్ చేయడం వల్లే వాళ్ల కెరియర్ లు మలుపులు తిరగవచ్చు.ఇక్కడ అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి.ప్రస్తుతం నరేష్ తెలుగులో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు.
ఫాదర్ రోల్స్ కి నరేష్ మంచి ఆప్షన్ గా మారాడు.ఇక ఇది ఇలా ఉంటే మా ఎలక్షన్స్ విషయంలో శివాజీ రాజా కి నరేష్ కి మధ్య చాలా గొడవలు జరిగిన విషయం కూడా మనందరికీ తెలిసిందే…ఇక రీసెంట్ గా సీనియర్ నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు.
చాలా రోజుల నుంచి పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్తూ వచ్చిన వీళ్లిద్దరూ ఫైనల్ గా సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు…
.