పిట్ట కొంచెం కొత్త ఘనం అంటే ఇదేనేమో మరి.పిల్లి బిత్తిరి ఎండ్రకాయ అమాంతం తాబేలునే లాక్కెళ్ళిపోతోంది అంటే మీరు నమ్మడం లేదు కదూ.
మేము కూడా మొదట నమ్మలేదు.ఇక్కడున్న వీడియో చూసిన తరువాత నమ్మకతప్పడం లేదు మరి! అవును, సముద్రపు జలాల్లో జీవించే జీవుల్లో పీతలు అనేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
ప్రపంచంలో సుమారు 4వేల కంటే ఎక్కువ జాతుల పీతలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అంచనా.వీటిలో కొన్ని నీరు, భూమిపై రెండింటిలోనూ నివసిస్తాయి.అలాగే కొన్ని ప్రమాదకరమైన పీతలు కూడా ఉంటాయన్న సంగతి విదితమే.
అలాంటి పీతలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇక్కడున్న వీడియోలో అది తాబేలును వేటాడడం మనం కళ్లారా చూడవచ్చు.ఈ వీడియోలో కనిపించే పీత చూడడానికి చాలా చిన్నగానే ఉంది.
అలాగే తాబేలు కూడా మరీ పెద్దగా ఏమీ లేదు.అది తాబేలు పిల్లలాగా వుంది.
భూమిపై నెమ్మదిగా పాకే జంతువుల్లో తాబేలు ఒకటి.దాన్ని చూసిన పీత దాని వైపు వేగంగా పరిగెత్తింది.
వెంటనే దానిని గట్టిగా పట్టుకుని లాక్కెళ్లుతుంది చూడండి.
సాధారణంగా సింహం, పులి వంటి జంతువులు వేటాడడం మనం చూసి ఉంటాం.కానీ పీత ఇలా వేటాడటం ఇప్పుడే చూస్తున్నాము.ఖచ్చితంగా ఈ వీడియో చూడండి.
అందులోనూ ఒక తాబేలును వేటాడడం చాలా అరుదు. @natureisbruta1 అనే ట్విట్టర్ ఐడీతో షేర్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇప్పటివరకు 19వేలకు పైగా వ్యూస్ రాగా వందలాది లైకులు, కామెంట్లు వస్తున్నాయి.ఇది మామ్మూలు పీత కాదు సుమా, తాబేలు పాలిట దయ్యం లాగా మారిందని ఒకరు కామెంట్ చేస్తే, ఇది చాలా క్రూరత్వమని కొందరు కామెంట్ చేస్తున్నారు.