ఆ విషయంలో మాత్రం చిరంజీవి సక్సెస్ కాలేకపోయారా?

మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో 150కు పైగా సినిమాలలో హీరోగా నటించారు.ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

 Interesting Facts About Hero Megastar Chiranjeevi, Chiranjeevi, Commercial Succe-TeluguStop.com

కెరీర్ తొలినాళ్లలో చిన్నాచితకా పాత్రలు చేసిన చిరంజీవి తర్వాత కాలంలో నటుడిగా ఎదగడంతో పాటు తన స్థాయిని పెంచుకున్నారు.ఇప్పటికీ చిరంజీవి సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ కావాల్సిందే అని చెప్పవచ్చు.

అయితే చిరంజీవి తన సినీ కెరీర్ లో ఒక విషయంలో మాత్రం సక్సెస్ సాధించలేకపోయారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.66 ఏళ్ల వయస్సులో కూడా 30 ఏళ్ల వయస్సు వ్యక్తిలా కనిపించే చిరంజీవి 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వేగంగా సినిమాలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అనే సంగతి తెలిసిందే.

ఎలాంటి పాత్రలోనైనా నటించి తనకంటే అద్భుతంగా మరెవరూ నటించలేరనే విధంగా సీన్ కు న్యాయం చేయడం విషయంలో చిరంజీవికి సాటి వచ్చేవాళ్లు ఎవరూ లేరు.

Telugu Anji, Chiranjeevi, Fantasy, Historical, Sri Manjunatha, Tollywood-Movie

అయితే చారిత్రక, పౌరాణిక పాత్రలలో చిరంజీవి నటుడిగా మెప్పించినా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోలేకపోయారు.చిరంజీవి హీరోగా తెరకెక్కి విడుదలైన ఫాంటసీ యాక్షన్ మూవీ అంజి కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.

సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి నటనకు ప్రశంసలు వచ్చినా చాలా ఏరియాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు.

Telugu Anji, Chiranjeevi, Fantasy, Historical, Sri Manjunatha, Tollywood-Movie

శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి శివుడి పాత్రలో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో పాటు చిరంజీవిని ఆ పాత్రలో ప్రేక్షకులు చూడలేకపోయారని కామెంట్లు వినిపించాయి.అయితే కమర్షియల్ సినిమాల విషయంలో మాత్రం చిరంజీవికి పోటీ ఇచ్చే హీరోలు ఎక్కువగా లేరనే చెప్పాలి.

చిరంజీవి తన సినీ కెరీర్ లో రీమేక్ సినిమాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో నటించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.

వరుసగా చిరంజీవి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా వచ్చే ఏడాది మే నెలలోగా ఆ సినిమాల షూటింగ్ ను పూర్తి చేయాలని చిరంజీవి భావిస్తున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube