నీరజ్ చోప్రా ముందు అతి పెద్ద లక్ష్యం..సాధిస్తే సరికొత్త చరిత్రే..!

ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ భారత స్టార్ నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ పై కన్నేశాడు.భారత్ కూడా నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధిస్తాడని ఆశలు పెట్టుకుంది.

 The Biggest Goal In Front Of Neeraj Chopra.. If Achieved It Will Be A New Histo-TeluguStop.com

ఒలంపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఏదైనా ఒక మెడల్ వస్తే చాలు అనే సమయంలో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించి భారత్ లోని అందరు తన వైపు తిరిగి చూసేలా చేశాడు.గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత కూడా నీరజ్ చోప్రా తన ఆటను నిలకడగా కొనసాగిస్తూ వరుసగా సరికొత్త రికార్డులను బద్దలు కొడుతూనే ఉన్నాడు.

గత సంవత్సరం వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ దక్కించుకున్న నీరజ్( Neeraj Chopra ) ఈసారి ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.టోక్యో ఒలంపిక్స్( Tokyo Olympics ) లో ఎవరు ఊహించని విధంగా గోల్డ్ మెడల్ దక్కించుకున్న నీరజ్ చోప్రా ఆ తర్వాత డైమండ్ లీగ్ లోను స్వర్ణాన్ని ముద్దాడాడు.

వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్( World Athletics Championships ) లో క్వాలిఫయింగ్ లో నీరజ్ చోప్రా అద్భుత ఆట ప్రదర్శన చూశాక.కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తాడు అనే నమ్మకం అందరిలోనూ పెరిగింది.కేవలం ఒకే ఒక త్రోతో 88.77 మీటర్ల దూరం బెల్లంను విసిరి డైరెక్ట్ ఫైనల్ కు రహత సాధించాడు.తన పర్ఫామెన్స్ తో గ్రూప్ లో అగ్రస్థానం అందుకోవడం తో పాటు పారిస్ ఒలంపిక్స్ కు బెర్త్ కూడా సంపాదించాడు.ఇక నీరజ్ చోప్రా ఈ ఫైనల్స్ లో ఎంతవరకు రాణిస్తాడో.

ప్రత్యర్థులకు ఎలాంటి సవాలను విసురుతాడో.భారత అభిమానుల నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడతాడో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube