టీడీపీ జనసేనకు  ఆ మాజీ స్పీకర్లే కీలకం ! వారికే ఈ బాధ్యతలు

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నట్లుగా ఏపీ సీఎం జగన్ ( AP CM jagan )ఏపీ క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు సంకేతాలు ఇవ్వడంతో,  ఏపీ రాజకీయాలు అనూహ్య పరిణామాలు చేసుకుంటున్నాయి .ఒకవైపు కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలలో ఉండగానే దానికి అనుగుణంగా జగన్ మంత్రులకు ఈ సూచనలు చేయడంతో , జనసేన , టిడిపిలు ( Janasena TDP )కూడా అలెర్ట్ అయ్యాయి.

 That Ex-speaker Is The Key To Tdp Janasena These Are Their Responsibilities , N-TeluguStop.com

ప్రస్తుతం జనసేన,  టిడిపిలు పొత్తు పెట్టుకున్నాయి.బిజెపి తమతో కలిసి వస్తుందనే ఆశతో ఉన్నాయి.

బిజెపి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినా, ఇవ్వకపోయినా  రెండు పార్టీలు వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు కసరత్తును మొదలుపెట్టాయి.టిడిపి అధినేత చంద్రబాబు( Chandra Babu arrest ) స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు కావడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్  చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన తర్వాత పొత్తుల అంశంపై క్లారిటీ ఇచ్చారు .

Telugu Chandra Babu, Chandrababu, Jagan, Janasena-Politics

తమ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయని,  బిజెపి కలిసి రావాలని పవన్ కోరారు .అయినా ఇప్పటివరకు బిజెపి నుంచి ఏ స్పందన రాలేదు.ప్రస్తుతం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి.అవి పూర్తయిన తర్వాత పవన్ ఢిల్లీకి వెళ్లి పొత్తుల అంశంపై క్లారిటీ తీసుకోబోతున్నట్లు సమాచారం.అలాగే టిడిపి తో తాను ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని బిజెపి పెద్దలకు వివరించి,  తమతో కలిసి రావాలని వారిని కోరాలని పవన్ నిర్ణయించుకున్నారు.  అక్కడ బిజెపి( BJP ) పెద్దల నుంచి వచ్చిన స్పందనకు అనుగుణంగా ఎన్డీఏలో కొనసాగాలా వద్ద అనే దానిపైన పవన్ నిర్ణయం తీసుకోబోతున్నారట.

జనసేన నుంచి టిడిపితో పొత్తుల సమన్వయ బాధ్యతలను ఇప్పటికే నాదెండ్ల మనోహర్ కు పవన్ అప్పగించారు.సీట్లు,  అభ్యర్థుల విషయమై రెండు పార్టీలు కలిసి ఎన్నికల వరకు నిర్వహించాల్సిన ఉమ్మడి పోరాటాలు ఒక పార్టీకి మరో పార్టీ మద్దతుగా నిలవడం వంటి అంశాలపై మనోహర్ స్పందిస్తారని క్లారిటీ ఇచ్చారు .

Telugu Chandra Babu, Chandrababu, Jagan, Janasena-Politics

ఈ మేరకు నాదెండ్ల మనోహర్ ( Nadendla manohar )అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు.బిజెపి వైఖరి పై క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల పొత్తు ఉంటుందా,  మూడు పార్టీల కలిసి వెళ్లాల్సి ఉంటుందా అనే దానిపైనా క్లారిటీ రానుంది.ఇక జనసేనతో టీడీపీ సమన్వయ భాద్యతలను సీనియర్ నేత యనమల రామకృష్ణుడు( Yanamala ramakrishnudu ) చూడాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారట.ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన యనమాలకు బాబు ఈ విషయం చెప్పారట.

  దీంతో జనసేన , టిడిపి ల తరపున సమన్వయ బాధ్యతలను మాజీ స్పీకర్ లుగా పనిచేసిన నాదెండ్ల మనోహర్ ,యనమల రామకృష్ణుడు తీసుకుంటున్నారు.ఈ ఇద్దరే ఇప్పుడు రెండు పార్టీల తరఫున కీలకంగా మారబోతున్నారు.

పొత్తులు , సీట్ల సర్దుబాటు వ్యవహారం పైన తమ రెండు పార్టీల అధినేతల ఆలోచనలకు అనుగుణంగా వీరు నిర్ణయాలు తీసుకోనున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube