కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు విజయ్ దళపతి.
ఈయన సినిమా లంటే అక్కడి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.అయితే ఇప్పుడు విజయ్ తెలుగు ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
ఎందుకంటే ఇప్పటి వరకు డైరెక్ట్ తమిళ్ సినిమాలు చేసిన విజయ్ ఇప్పుడు
డైరెక్ట్ తెలుగు
సినిమా చేస్తూ అందరికి షాక్ ఇచ్చాడు.ఇక్కడ సినిమా చేయడంతో ఈయన ఇక్కడ మార్కెట్ మరింత పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.
అందుకే టాలీవుడ్ డైరెక్టర్ తో విజయ్ తన 66వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు భారీ పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమాలో రష్మిక నటిస్తుందని అఫిషియల్ గా కూడా ప్రకటించడమే కాకుండా పూజా కార్యక్రమాలతో షూట్ కూడా మొదలు పెట్టేసారు.వంశీ మొదటిసారి ఒక బై లాంగువల్ సినిమాను ఓకే చెయ్యగా దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
లేటెస్ట్ గా ఈ సినిమాపై మరొక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుండగా విజయ్ అభిమానులంతా ఈ సినిమా నుండి విజయ్ పుట్టిన రోజు ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు.
జూన్ 22న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఉండనుందని టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కాకుండా టైటిల్ కూడా రివీల్ చేయనున్నట్టు.అందుకు మేకర్స్ సన్నాహాలు కూడా చేస్తున్నట్టు టాక్.ఇప్పటికే టైటిల్ కూడా లాక్ చేశారట.దీంతో ఈసారి విజయ్ బర్త్ డే ట్రీట్ అదిరిపోనుందని తెలుస్తుంది.