మరో రెండు వారాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నేపథ్యంలో పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణలో జరుగుతున్న సర్వేలలో బీఆర్ఎస్.కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ ఉన్నట్లు విజయం దోబూచులాడుతున్నట్లు ఫలితాలు వస్తున్నాయి.
ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్.కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం( Kodangal Assembly constituency )లో కోస్గిలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్.
కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీ ఆందోళనలు చేశారు.కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డి( Somasekhar Reddy ) వాహనాల్లో డబ్బులు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
దీంతో పరస్పరం ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో పలువురికి గాయాలయ్యాయి.దీంతో కోస్గిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఆందోళన చేపట్టారు.
ఇదే సమయంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఆందోళన చేశారు.దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడం జరిగింది.
ఈ క్రమంలో కోస్గి పోలీస్ స్టేషన్ ఎదుట ఇరు వర్గాలకు చెందిన వాళ్లు నినాదాలు చేయడం జరిగింది.