'సింగపూర్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్'....లో తెలుగు మహిళలు

తెలుగువాళ్ళు ఎక్కడ ఉన్నా.ఎలాంటి పని చేసినా అది రికార్డే.

 Telugu Womens In Singapore Book Of Record-TeluguStop.com

విదేశాలలో ఉన్న తెలుగు వారు ఎప్పటికప్పుడు కలుసుకుంటూ తెలుగు జాతి సమైఖ్యతని చాటి చెపుతూ ఉంటారు.అలాంటి సందర్భంలో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటారు.

అలాంటి సంఘటన ఒకటి సింగపూర్ లో జరిగింది.సింగపూర్‌ లో నివసించే తెలుగుమహిళల కోసం సింగపూర్‌ తెలుగు సమాజం ‘నారి-2018’ అనే పేరుతో లేడీస్‌ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమం అక్కడ స్థానిక హోటల్‌లో జరిగింది ఈ కార్యక్రమానికి ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించగా ప్రముఖ నటి.ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.దాదాపు తెలుగు మహిళలు 550 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా మిస్‌ అండ్ మిసెస్‌ ఎస్‌టీఎస్‌ పోటీలు, మహానటి వేషభాషల అనుకరణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

వందమంది మహిళలు వివిధ సంప్రదాయాల్లో చీరలు ధరించి “సింగపూర్‌ బుక్‌ ఆఫ్రికార్డ్స్ లో స్థానం సంపాదించారు…ఇదిలాఉంటే ఈ కార్యక్రమంలో అడ్వకేట్ వెంకటేశ్వరితో కలిసి ‘లైఫ్ అండ్ లా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.కేలవం మహిళల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సింగపూర్‌ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube