తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన “నిన్నే పెళ్లాడతా.!” అనే చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “సన” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి సన సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో కొంతమేర గ్లామర్ కి స్కోప్ ఉన్నటువంటి పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులని బాగానే అలరించింది.అంతేగాక అప్పట్లో టాలీవుడ్ యంగ్ హీరో సాయి కుమార్ హీరోగా నటించిన పోలీస్ స్టోరీ -2 చిత్రంలో విలన్ పాత్రలో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి సన పాల్గొంది. ఇందులో భాగంగా తన సినీ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో ముఖ్యంగా మొదట్లో తనకు బాలీవుడ్ సినిమాలలో నటించే ఆఫర్లు వచ్చాయని కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అందులో నటించ లేకపోయానని చెప్పుకొచ్చింది.

తనకి సినిమాలలో గ్లామరస్ పాత్రలు పోషించాలని ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల రీత్యా గ్లామర్ షో చేయలేకపోయానని తెలిపింది. కానీ తాను గ్లామర్ షో చేసేందుకు తన భర్త సదత్ కూడా మద్దతు తెలిపినప్పటికీ ఎందుకో నటించ లేకపోయానని చెప్పుకొచ్చింది. అలాగే తన భర్త సదత్ అంటే తనకు చాలా ఇష్టమని తన ఇష్టాలకి చాలా ప్రాముఖ్యతని ఇస్తాడని, అందుకే తన భర్త అంటే తనకు చాలా ఇష్టమని తన భర్త పై ఉన్నటువంటి ప్రేమను వ్యక్త పరిచింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి సన కొడుకు సయ్యద్ అన్వర్ అహ్మద్ కూడా తమిళంలో పలు సీరియళ్లలో హీరోగా నటించడమే కాక నిర్మాతగా కూడా వ్యవహరించాడు.అలాగే నటి సన కోడలు కూడా తెలుగులో పలు సీరియళ్లలో హీరోయిన్ గా నటించింది.
ఆమె ఎవరో కాదు తెలుగు ప్రముఖ సీరియల్ హీరోయిన్ సమీరా షరీఫ్. కాగా ఈమె కూడా తెలుగు, తమిళంలో పలు ధారావాహికలకు నిర్మాతగా వ్యవహరించింది.