తెలుగులో నేనే రాజు నేనే మంత్రి, సరైనోడు, ఇద్దరమ్మాయిలతో, తదితర చిత్రాలలో రెండో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముంబై బ్యూటీ కేథరిన్ తెరిసా గురించి సినీ ప్రేక్షకులకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువ చిత్రాలలోనే అయినప్పటికీ తన నటన అందం అభినయంతో కట్టి పడేసింది.
కానీ నటన పరంగా ఈ అమ్మడికి చాలా ప్రతిభ ఉన్నప్పటికీ ఇప్పటివరకు తన నటనా ప్రతిభను నిరూపించుకునే అవకాశం రాలేదని చెప్పాలి. అందువల్లనే అన్నీ ఉన్నా ఈ బ్యూటీ గుర్తింపుకి నోచుకో లేకపోయింది.
కాగా ఈ మధ్య కాలంలో కేథరిన్ తెరిసా సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.ఈ క్రమంలో అప్పుడప్పుడు లైవ్ మరియు చిట్ చాట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది.
దీంతో తాజాగా ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న మీరు పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారని ప్రశ్నించారు. దీంతో కేథరిన్ తెరిసా ఈ విషయంపై స్పందిస్తూ తనకు తగ్గ వరుడు దొరికినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తన పెళ్లి గురించి మీరేమి కంగారు పడకండని చాలా సున్నితంగా సమాధానం చెప్పుకొచ్చింది.
అలాగే తనకు కాబోయే వాడు కోటీశ్వరుడు అయి ఉండాల్సిన అవసరం లేదని తనని అర్థం చేసుకొని జీవితాంతం బాగా చూసుకునే వ్యక్తి అయితే చాలని తెలిపింది.అంతేగాక తనకి తెలుగులో నటించాలని ఉందని ఈ క్రమంలో తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని కూడా తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కేథరిన్ తెరిసా తెలుగులో తుగ్లక్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో హీరోగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి నూతన దర్శకుడు వేణు దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపుగా 40 శాతం పూర్తయినట్లు సమాచారం.అయితే ఇటీవలే కేథరిన్ తెరిసా మలయాళంలో ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.