మూడోసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.మొత్తం 119 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానాలు గెలవడం జరిగింది.
మేజిక్ ఫిగర్ 60 కాగా.కాంగ్రెస్ నాలుగు స్థానాలు అధికంగానే గెలవడం జరిగింది.
దీంతో కాంగ్రెస్.ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడంలో గెలుపులో.
కీలక పాత్ర పోషించటంతో రేవంత్ కి పదవి కట్టబెట్టడమే సరైనదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారంట.
రాజస్థాన్ అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని.కాంగ్రెస్ పెద్దలు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.డిసెంబర్ 4వ తారీఖు సోమవారం ఎల్బీ స్టేడియంలో.
ముఖ్యమంత్రి పదవి స్వీకారం కార్యక్రమం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ ఎన్నికలలో మొదటినుండి కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చాలా సర్వేలలో ఫలితాలు వచ్చాయి.
ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ రకంగానే ప్రకటించాయి.ఆ రకంగానే తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వటం జరిగింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినగాని మొదటి రెండుసార్లు ఓడిపోయింది.అయితే ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావడంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ నెలకొంది.