హనుమాన్ కు టికెట్లు దొరక్క డబ్బా థియేటర్లు సైతం కళకళ.. గంటకు అన్ని వేల టికెట్లు బుక్ అవుతున్నాయా?

తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ( Hanu Man ) బుకింగ్స్ విషయంలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే.ఈరోజు, రేపటికి కూడా ఈ సినిమా బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.

 Teja Sajja Hanuman Movie Bookings Hot Topic Details Here Goes Viral In Social M-TeluguStop.com

హనుమాన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి థియేటర్లు దొరకలేదనే సంగతి తెలిసిందే.థియేటర్ల సమస్య వల్ల కొన్ని డబ్బా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.

అయితే హనుమాన్ కు సరైన థియేటర్లు దొరక్క డబ్బా థియేటర్లు సైతం కళకళలాడుతున్నాయి.

Telugu Bookmy, Hanuman, Mahesh Babu, Prashanth Varma, Saindhav, Teja Sajja, Toll

గంటకు ఈ సినిమాకు 25 వేల టికెట్లు బుక్ అవుతున్నాయని బుక్ మై షో ( BookMyShow )లెక్కల ప్రకారం అర్థమవుతోంది.ఇతర బుకింగ్స్ యాప్స్ నుంచి బుక్ అయ్యే టికెట్లను కూడా కౌంట్ చేస్తే గంటకు ఈ సినిమాకు 50 వేల టికెట్లు బుక్ అవుతున్నాయని అర్థం చేసుకోవచ్చు.ఆఫ్ లైన్ లో కూడా ఈ సినిమాకు టికెట్లు ఊహించని స్థాయిలో బుక్ అవుతున్నాయని సమాచారం అందుతోంది.

హనుమాన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

Telugu Bookmy, Hanuman, Mahesh Babu, Prashanth Varma, Saindhav, Teja Sajja, Toll

గుంటూరు కారం, సైంధవ్ సినిమాలకు ఆశించిన రేంజ్ లో టాక్ రాకపోవడంతో హనుమాన్ కు మరిన్ని స్క్రీన్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.ఇప్పటికే ఆంధ్రలో హనుమాన్ కు స్క్రీన్లు పెరగగా సోమవారం నుంచి నైజాంలో కూడా ఈ సినిమా పరిస్థితి మారుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.తెలుగులో సరైన సక్సెస్ లేని అమృత అయ్యర్ ఈ సినిమాతో సక్సెస్ ను అందుకోవడంతో సంతోషిస్తున్నారు.

Telugu Bookmy, Hanuman, Mahesh Babu, Prashanth Varma, Saindhav, Teja Sajja, Toll

ప్రశాంత్ వర్మ తర్వాత సినిమాలు సైతం సూపర్ హీరో తరహా కాన్సెప్ట్ లతో తెరకెక్కనున్నాయని తెలుస్తోంది.తేజ సజ్జా ప్రశాంత్ వర్మ మధ్య అనుబంధం కొనసాగాలని భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో మరిన్ని భారీ ప్రాజెక్ట్ లు రావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రశాంత్ వర్మకు భారీ బడ్జెట్ ఇస్తే అద్భుతాలు చేస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube