టాలీవుడ్ ఇండస్ట్రీలో వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi Sarath Kumar ) కు ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వరలక్ష్మి శరత్ కుమార్ నటించి సంక్రాంతికి ఆ సినిమా విడుదలైతే బొమ్మ బ్లాక్ బస్టర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
క్రాక్, వీరసింహారెడ్డి, హనుమాన్( Crack, Veerasimha Reddy, Hanuman ) సినిమాలతో ఈ సెంటిమెంట్ ప్రూవ్ అయింది.వరలక్ష్మి నటిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అన్ని సినిమాలు సక్సెస్ సాధించలేదు కానీ సంక్రాంతి సినిమాలు మాత్రం ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించాయి.ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం కనకవర్షం కురిపించాయి.
వరలక్ష్మి శరత్ కుమార్ ఎంచుకునే పాత్రలు సైతం విమర్శలకు తావివ్వకుండా ఉన్నాయి.అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఆమె నటించి సత్తా చాటుతుండటం గమనార్హం.
పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఆ సినిమాకు వరలక్ష్మి శరత్ కుమార్ ప్లస్ అవుతున్నారే తప్ప మైనస్ కావడం లేదు.వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది.వరలక్ష్మి శరత్ కుమార్ రాబోయే రోజుల్లో టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో మరింత బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హనుమాన్ మూవీలో హీరోకు అక్క పాత్రలో నటించిన వరలక్ష్మి ఆ పాత్రలో ఎమోషన్స్ ను అద్భుతంగా పండించారు.ఆ పాత్రకు దర్శకుడు ఇచ్చిన ముగింపు సైతం షాకిచ్చేలా ఉంది.వరలక్ష్మి శరత్ కుమార్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా వరలక్ష్మికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
వరలక్ష్మి శరత్ కుమార్ సరైన ప్రాజెక్ట్ లతో ముందుకెళ్లాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.రాబోయే రోజుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.