హనుమాన్ కు టికెట్లు దొరక్క డబ్బా థియేటర్లు సైతం కళకళ.. గంటకు అన్ని వేల టికెట్లు బుక్ అవుతున్నాయా?
TeluguStop.com
తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ( Hanu Man ) బుకింగ్స్ విషయంలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే.
ఈరోజు, రేపటికి కూడా ఈ సినిమా బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.
హనుమాన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి థియేటర్లు దొరకలేదనే సంగతి తెలిసిందే.థియేటర్ల సమస్య వల్ల కొన్ని డబ్బా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.
అయితే హనుమాన్ కు సరైన థియేటర్లు దొరక్క డబ్బా థియేటర్లు సైతం కళకళలాడుతున్నాయి.
"""/" /
గంటకు ఈ సినిమాకు 25 వేల టికెట్లు బుక్ అవుతున్నాయని బుక్ మై షో ( BookMyShow )లెక్కల ప్రకారం అర్థమవుతోంది.
ఇతర బుకింగ్స్ యాప్స్ నుంచి బుక్ అయ్యే టికెట్లను కూడా కౌంట్ చేస్తే గంటకు ఈ సినిమాకు 50 వేల టికెట్లు బుక్ అవుతున్నాయని అర్థం చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్ లో కూడా ఈ సినిమాకు టికెట్లు ఊహించని స్థాయిలో బుక్ అవుతున్నాయని సమాచారం అందుతోంది.
హనుమాన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. """/" /
గుంటూరు కారం, సైంధవ్ సినిమాలకు ఆశించిన రేంజ్ లో టాక్ రాకపోవడంతో హనుమాన్ కు మరిన్ని స్క్రీన్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
ఇప్పటికే ఆంధ్రలో హనుమాన్ కు స్క్రీన్లు పెరగగా సోమవారం నుంచి నైజాంలో కూడా ఈ సినిమా పరిస్థితి మారుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తెలుగులో సరైన సక్సెస్ లేని అమృత అయ్యర్ ఈ సినిమాతో సక్సెస్ ను అందుకోవడంతో సంతోషిస్తున్నారు.
"""/" /
ప్రశాంత్ వర్మ తర్వాత సినిమాలు సైతం సూపర్ హీరో తరహా కాన్సెప్ట్ లతో తెరకెక్కనున్నాయని తెలుస్తోంది.
తేజ సజ్జా ప్రశాంత్ వర్మ మధ్య అనుబంధం కొనసాగాలని భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో మరిన్ని భారీ ప్రాజెక్ట్ లు రావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ వర్మకు భారీ బడ్జెట్ ఇస్తే అద్భుతాలు చేస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి