పొత్తుల భయం లో టీడీపీ నేతలు ? లోకేష్ చుట్టూ ప్రదక్షణాలు ?

2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని, పొత్తు పెట్టుకోక పోతే మళ్ళీ 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని అందరికీ అర్థమైపోయింది.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు లో ఈ అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది.

 Tdp Leaders-trying To Get Close To Lokesh Without Bothering About The Upcoming E-TeluguStop.com

అందుకే ఆయన ఎప్పటి నుంచో పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.బిజేపి తో పొత్తు పెట్టుకోవడం ద్వారా 2014 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని చూస్తున్నారు.

అయితే బిజెపి మాత్రం వీలైనంత దూరంగానే టిడిపిని పెడుతోంది.దీంతో ఇప్పుడు జనసేన వైపు టిడిపి దృష్టిసారించింది .ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ను ఒప్పించి పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో టిడిపి ఉంది.దీని కోసం భారీ స్థాయిలో సీట్లను త్యాగం చేసేందుకు సిద్ధమని సంకేతాలను పంపించింది.

అయితే ఇప్పటి వరకు పవన్ నుంచి ఈ విషయంలో రెస్పాన్స్ రాలేదు.
        అయితే ఎన్నికల కు ముందు ఈ పొత్తు ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తోంది .బిజేపి తో పొత్తు రద్దు చేసుకుని టిడిపి తో ముందుకు వెళ్లేందుకు పవన్ సిద్ధం అవుతారని ప్రచారం జరుగుతోంది.  ఈ నేపథ్యంలో జనసేన టిడిపి పొత్తు ఖరారు అయితే దాదాపు 40 స్థానాలకు పైగా జనసేన కోసం టిడిపి త్యాగం చేసేందుకు సిద్ధమవుతోంది .దీంతో టిడిపి నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న నాయకుల్లో ఆందోళన మొదలైంది.పొత్తుల లో భాగంగా తమ సీటుకు ఎసరు వస్తుందనే ఆలోచనతో ముందస్తుగానే యువ నేత,  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట.

లోకేష్ ను తమ నియోజకవర్గంలో పర్యటనకు రావాలని ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నాడట.ఏదో రకంగా లోకేష్ కు మరింత దగ్గరై సీటుకు ఎసరు రాకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు . 
   

Telugu Chandrababu, Janasena, Janasenani, Lokesh, Pavan Kalyan, Tdp Ap, Tdpjanas

  2019 ఎన్నికల సమయంలో టిడిపి ఒంటరిగా పోటీ చేయడంతో,  లోకేష్ తన అనుకున్న వారందరికీ టిక్కెట్లు ఇప్పించుకోగలిగారు.అయితే 2024 ఎన్నికల్లో టిడిపి కనుక జనసేన,  వామపక్ష పార్టీలు కాంగ్రెస్ ఈ మూడింటిలో ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా, సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది.అందుకే ఇప్పటి నుంచే లోకేష్ దృష్టిలో పడేందుకు టికెట్లు ఆశిస్తున్న నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.జనసేన తో కనుక టిడిపి పొత్తు ఖరారు అయితే ఉబయ గోదావరి జిల్లాలతో పాటు,  ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా టిడిపి సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది .దీంతో ఎక్కువగా ఆ ప్రాంత నాయకులే లోకేష్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారట.రాబోయే ఎన్నికల్లో టిడిపిలో టిక్కెట్ల కేటాయింపు విషయంలో లోకేష్ కీలకం కాబోతుండడం తోనే ఈ పరిస్థితి ఏర్పడింది.

   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube