అది టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు.అయితే ఏంటి.అంటారా? అంతో ఇంతో టీడీపీ ఒకింత దూకుడుగా ఉంటుంది కదా! అలానేఉంది.ముఖ్యంగా చంద్రబాబుపై అభిమానం కావొచ్చు.
పార్టీపై సానుభూతి కావొచ్చు.పొలోమని.
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు దారులు కదం తొక్కారు.అయితే.
వీరికి ప్రత్యక్షంగానో.పరోక్షంగానో
మీరు నామినేషన్ వేయండి నేను చూసుకుంటాను.అనే ధీమా తప్ప.
మరేమీ క్షేత్రస్థాయిలో టీడీపీ మద్దతు దారులకు లభించలేదు.ఇంకేముంది.
వైసీపీ నాయకులు రెచ్చిపోయారు.
అందునా.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి అనుచరులు.`పై నుంచి` వచ్చిన ఆదేశాలతో అటు పుంగనూరు, ఇటు తంబళ్లపల్లిలో సత్తా చూపించారు.ఎంత చిత్రం అంటే.పుంగనూరు గురించి చెప్పుకొంటే.ఆశ్చర్యం కూడా వేస్తుంది.ఇక్కడ 83 పంచాయతీ లు ఉన్నాయి.
ఎంత ఏకగ్రీవాలైనా.ఓ సగం అయ్యాయని అనుకుందాం.
మిగిలిన 43 పంచాయతీలకు పోలింగ్ జరగాలి కదా(రెండో దశ)! కానీ.ఎన్ని చోట్ల జరుగుతున్నాయో తెలుసా? కేవలం మూడంటే మూడు పంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు.మరి.మిగిలిన 80 పంచాయతీలు.ఏకగ్రీవాలేనా? అంటే.ఔననే అంటున్నారు అధికారులు(అధికారికంగా కాదు!!)

ఇక, తంబళ్లపల్లిలోనూ సీన్ ఇలానే ఉంది.ఇక్కడ 65 పంచాయతీలు ఉంటే.22 ఏకగ్రీవాలు అయ్యాయి.మరో 20 చోట్ల టీడీపీకి అభ్యర్థులే లేకుండా పోయారట!!? మిగిలిన చోట్ల కూడా నామమాత్రంగా మాత్రమే అభ్యర్థులు బరిలో దిగారు.మరి అసలు అన్నదమ్ముల దూకుడు వెనుక ఏం జరిగింది? అంటే.ఎక్కడికక్కడ ఏకగ్రీవాలు.జరిగాయా? అంటే కాదు.పుంగనూరులో 40 చోట్ల నామినేషన్లు వేశారు.అయితే.అవన్నీ.టెక్నికల్‌గా రద్దయ్యాయి.
`సరిగా` లేవట! దీంతో అధికారులు తిప్పికొట్టారు.ఇక, మిగిలిన సగంలో అసలు నామినేషన్ అనే మాటే ఎత్తకుండా కొందరు చక్రం తిప్పారు.
ఇంకేముంది.ఈ రెండు నియోజకవర్గాలు.అందునా.చంద్రబాబు పుట్టిపెరిగినగడ్డపై సైకిల్‌కు తూట్లు పడ్డాయి.
అయితే.ఇంతకీ తప్పు ఎవరిదని ఇక్కడ ప్రచారం జరుగుతోందో తెలుసా? చంద్రబాబుదేనని!! చిత్రంగా ఉన్నా.అందరూ ఇదే మాట అంటున్నారు.బాబు మమ్మల్ని పట్టించుకోలేదు! అని చెబుతున్నారు.ఇంతకు మించి మాట్లాడే `ధైర్యం` వారిలో లేదో ఏమో!! ఏమైనా మాట్లాడితే.వాళ్లకు వాళ్లే `ఆత్మహత్య`లు చేసుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదేమో!!.
ఇదీ ఆ అన్నదమ్ముల మధ్య నలుగుతున్న తమ్ముళ్ల పరిస్థితి!!
.