పొత్తుల భయం ! సొమ్ములు తీయని ' తమ్ముళ్లు ' ?

రాబోయే ఏపీ ఎన్నికల్లో టిడిపిని ( TDP ) అధికారంలోకి తీసుకురావాలనే ఆశతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ( Chandrababu Naidu ) ఉన్నారు.దీనిలో భాగంగానే వైసిపి ( YCP ) ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరంతరం జనాల్లోనే తిరుగుతున్నారు.

 Tdp Leaders Not Actively Campaigning Due To Fear Of Forming Alliances With Janas-TeluguStop.com

పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ,  నాయకులు జనాల్లోకి వెళ్లే విధంగా ప్రోత్సహిస్తున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ మళ్ళీ ఏపీలో అధికారంలోకి రాకూడదనే పట్టుదల చంద్రబాబులో కనిపిస్తోంది.

అందుకే రాబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు.ముఖ్యంగా జనసేన పార్టీతో పాటు , బిజెపిని ఓపించి పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు.

తమ గెలుపునకు తిరుగు ఉండదనే అంచనాలో ఉన్నారు.

అయితే జనసేన తో పొత్తు దాదాపుగా ఖాయం అయిందని అంతా భావిస్తున్నారు .ఎన్నికల సమయంలో అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో,  పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశం ఉందనుకున్న నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు అంత యాక్టివ్ గా కనిపించడం లేదు .రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే భారీగా సొమ్ములు ఖర్చుపెట్టినా,  ఎన్నికల సమయంలో జనసేనతో పొత్తు( Janasena ) పెట్టుకుని తమ నియోజకవర్గాన్ని జనసేనకు పొత్తులో భాగంగా కేటాయిస్తే తమ పరిస్థితి ఏమిటి అని ,

Telugu Ap Bjp, Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Janasenatdp, Pavan

పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా  టికెట్ దక్కకపోతే ఆ సొమ్ము వృధా అవుతుంది అని చాలామంది టిక్కెట్ ఆశిస్తున్న నాయకులు భావిస్తున్నారట.  అందుకే పార్టీ కోసం సొమ్మును ఖర్చు పెట్టేందుకు అంతగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.జనసేనకు పొత్తులో భాగంగా సీటు దక్కే అవకాశం ఉందనుకున్న నియోజకవర్గాల్లోని టిడిపి ఇన్చార్జీలు అంత యాక్టివ్ గా కనిపించడం లేదట.ఇదే విషయం చంద్రబాబు దృష్టికి చేరడంతో,  ఏఏ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదు ? 

Telugu Ap Bjp, Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Janasenatdp, Pavan

ఏ ఏ నాయకుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలపై ఆరా తీస్తూ వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట.పొత్తుల తో సంబంధం లేకుండా,  నిరంతరం ప్రజల్లో ఉండాలని,  ఒకవేళ జనసేనతో పొత్తు కుదిరినా, ఆ నియోజకవర్గం కేటాయించినా,  ప్రత్యామ్నాయంగా కీలకమైన పదవులు ఇచ్చి ఆర్థికంగానూ ఆదుకుంటామనే భరోసా చంద్రబాబు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట.అయినా చాలా నియోజకవర్గాల్లో యాక్టివ్ గా ఉంటూ సొమ్ములు ఖర్చు పెట్టేందుకు నియోజకవర్గ స్థాయి నాయకులు అంతగా ఆసక్తి చూపించడం లేదట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube