నందమూరి తారకరామారావు( Tarakaramarao ) శత జయంతి వేడుకలను ఎంత ఘనంగా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.గత ఏడాది నుంచి నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు.
ఇకపోతే నేడు విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవాలను పురస్కరించుకొని భారీ సభను నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
నేడు సాయంత్రం విజయవాడ పోరంకిలో ఉన్న అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శత దినోత్సవ సభ జరగనుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం నటుడు రజనీకాంత్ ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు.ఈ క్రమంలోనే గన్నవరం విమానాశ్రయంలో రజనీకాంత్ కి నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) స్వయంగా స్వాగతం పలికారు.బాలకృష్ణతోపాటు టీడీ జనార్దన్, సావనీర్ కమిటీఘనా స్వాగతం పలికారు.
బాలయ్యను చూడగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నఈ హీరోలు పరస్పరం ఒకరి బాగోగులు మరొకరు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఇద్దరు కలిసి ఒకే కారులోనే నోవోటెల్ కు వెళ్లారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చినందుకు రజనీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య.
ఇలా నేడు ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనబోతున్నారు.అయితే ఈ శత దినోత్సవ జయంతి వేడుకలలో భాగంగా నందమూరి కుటుంబం ఎన్టీఆర్ కు ఇప్పటివరకు ఇన్విటేషన్ ఇవ్వలేదని, ఈ వేడుకకు ఎన్టీఆర్ ను దూరం పెట్టారని తెలుస్తోంది.దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య మొదటి నుంచి ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారు అని ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.