కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వీటినే ఉపకుంచి, నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారు.అయితే కలోంజి విత్తనాల వాడకం పూర్వం నుండి వస్తోంది.
అలాగే ఆయుర్వేదంలో కూడా వీటిని అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు.అయితే కలోంజి విత్తనాలు తీసుకోవడం వలన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి.
అలాగే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు శరీరాన్ని ఎటాక్ చేయకుండా కాపాడుతాయి.అలాగే మన ఆహారంలో ఈ విత్తనాలను భాగంగా చేసుకోవడం వలన చాలా రకాల సమస్యల నుండి బయటపడవచ్చు.
అలాగే వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వీటిని తీసుకోవడం వలన మెమరీ పవర్ పెరగడంలో ఇవి బాగా సహాయపడతాయి.అలాగే కలోంజి సీడ్స్ లో కొంచెం తేనె( Honey ) కలుపుకొని తింటే క్రమ క్రమంగా మెమరీ పవర్ బాగా పెరుగుతుంది.అలాగే దీన్ని చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు.దీన్ని తీసుకోవడం వల్ల మతిమరుపు, అల్జీమర్స్ లాంటివి దూరం అవుతాయి.ఇక వెయిట్ లాస్ అవ్వాలనుకున్నవారు కూడా కలోంజి సీడ్స్ తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలు ఉంటాయి.అయితే ముందుగా కలోంజి గింజలను దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి.
దాన్ని తినే ఆహారంలో, సలాడ్స్, జ్యూస్ ఇలా వేటిలో అయినా కలుపుకొని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.
<em

>డయాబెటిస్ ( Diabetes )ఉన్నవారు కూడా ఏ ఆహార పదార్థాలైనా తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు.అలాంటి వారు కలోంజి సీడ్స్ కచ్చితంగా తీసుకోవచ్చు.కలోంజి విత్తనాలు తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
కాబట్టి వైద్యులు కూడా వీటిని తీసుకోవాలని సలహాలు ఇస్తూ ఉంటారు.చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ వంటివి ఎటాక్ అయి చనిపోతున్నారు.అలాంటివారు తరచు కలోంజి విత్తనాలు తీసుకోవడం చాలా మంచిది.
ఎందుకంటే ఇవి రక్తనాళాల్లో పేర్కొన్న కొవ్వును కరిగిస్తుంది.దీంతో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.
దీంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది.అలాగే వీటిని ఎనర్జీ లెవెల్స్ ( Energy levels )పెరుగుతాయి.
అలాగే రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.