ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ – జనసేన( TDP , Janasena ) గెలుపే లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తున్నాయి.ఈ మేరకు సంక్రాంతికి టీడీపీ – జనసేన మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
ఇప్పటికే మ్యానిఫెస్టోపై టీడీపీ – జనసేన అధినేతల కసరత్తు పూర్తయింది.కాగా ప్రతి చేనుకు నీరు – ప్రతి చేతికి పని పేరుతో ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ – జనసేన భావిస్తోంది.
ఇప్పటికే బాబు షూరిటీ – భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే.అదేవిధంగా సూపర్ సిక్స్ పేరుతో రాజమండ్రి మహానాడులో మ్యానిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారు.
ఈ క్రమంలో పూర్తి మ్యానిఫెస్టోను ప్రకటించాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.
అలాగే సంక్రాంతికి టీడీపీ( TDP ) తొలి జాబితా విడుదల చేయనున్నారు చంద్రబాబు( Chandrababu naidu ).వివిధ సర్వేల ఆధారంగా వడపోత కార్యక్రమాన్ని చేపట్టారు.పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తొలి విడతలో సుమారు 50 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తుందని సమాచారం.మరోవైపు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లను పక్కన పెట్టి మిగిలిన స్థానాలపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం.