కృష్ణా జిల్లా పై పట్టు బిగిస్తున్న తెదేపా?

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి( TDP ) కంచుకోటగా నిలిచిన జిల్లాగా పేరు పొందిన కృష్ణా జిల్లా( Krishna District ) గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశానికి వరుసగా షాకులు ఇస్తుంది.ముఖ్యంగా ఎలాంటి అభ్యర్ధి ని నిలబెట్టినా కూడా గెలుపు నల్లేరుపై నడకలా ఉండే కృష్ణాజిల్లాలో ఇద్దరు అభ్యర్థులు మాత్రం తెలుగుదేశానికి ముచ్చెమట్లు పట్టిస్తున్నారు.

 Tdp Is Tightening Its Grip On Krishna District Details, Tdp, Krishna District, C-TeluguStop.com

వీరిద్దరూ తెలుగుదేశం నుంచి పరిచయం కాపాడిన వారే కావడం విశేషం.కుటుంబానికి పెద్దగా రాజకీయ చరిత్ర లేకపోయినా హరికృష్ణ కుటుంబం జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) మద్దతుతో తెలుగుదేశం టికెట్ దక్కించుకో గలిగిన ఈ ఇద్దరు, తర్వాత తమ తమ నియోజకవర్గాలలో కీలక నాయకులుగా చక్రం తిప్పారు .వారే గుడివాడ ఎంఎల్ఏ కొడాలి నాని( Kodali Nani ) మరియు గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi ) పార్టీతో సంబంధం లేకుండా తమ వ్యక్తిగత చరిష్మాతో గెలవగలిగే స్థాయికి చేరుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇద్దరూ జలక్ ఇచ్చారు .

Telugu Chandrababu, Krishna, Mla Kodali Nani, Lokesh, Nrivenigandla-Telugu Polit

ముఖ్యంగా తెలుగుదేశం అదినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై వ్యక్తిగత స్థాయిలో శతృత్వం ఉన్నట్టుగా విమర్శలు చేసే వీరు వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు అన్న పట్టుదలలో తెలుగుదేశం అధిష్టానం ఉంది.అయితే ఇంతకాలం వీరిద్దరిని ఓడించే స్థాయి ఉన్న నాయకుడు తెలుగుదేశానికి దొరకలేదు.అయితే గన్నవరంలో మాత్రం తెలుగుదేశానికి ఆ లోటు తీరిపోయింది.

గత ఎన్నికల్లో వంశీకి ప్రత్యర్థిగా పనిచేసిన వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు( Yarlagadda Venkatrao ) తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోవటంతో, ఆయన వ్యక్తిగత చరిష్మాకు తోడు తెలుగుదేశం బలమైన మద్దతు ఉంటే కచ్చితంగా ఈసారి గెలుపు యార్లగడ్డదే అంటూ విశ్లేషణలు వస్తున్నాయి.

Telugu Chandrababu, Krishna, Mla Kodali Nani, Lokesh, Nrivenigandla-Telugu Polit

ముఖ్యంగా స్వంత సామాజిక వర్గంలో వ్యతిరేకత తెచ్చుకోవడం, వైసిపి ద్వితీయ శ్రేణి నాయకులతో సత్ సంబంధాలు లేకపోవడంతో కేవలం తన వ్యక్తిగత చరిష్మాతో గెలవాల్సిన పరిస్థితుల్లో వంశీ ఉన్నారు.అందువల్ల ఆయన గెలుపు కష్టమంటూ తెలుస్తుంది.అయితే కొడాలి నాని కి మాత్రం ఆ సమస్య లేదు గత నాలుగు ధపాలుగా వరుసగా గెలుస్తున్న నాని మరోసారి గెలవడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి .ఇప్పటివరకు నానిని ఢీకొట్టే స్థాయి అభ్యర్థి తెలుగు దేశానికి దొరకలేదు .ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరావు( Raavi Venkateswar Rao ) గాని ఎన్నారై వెనిగండ్ల రాము( NRI Venigandla Ramu ) కానీ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు లేవు వారు పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నపటికీ గెలుపుపై మాత్రం తెలుగుదేశానికి ఆశలు లేవు .చివరి నిమిషం వరకు అభ్యర్థిని వెతికి తప్పకపోతే వెని గండ్ల రాముకు అవకాశం ఇచ్చే ఉద్దేశంతో తెలుగుదేశం ఉన్నట్లుగా తెలుస్తుంది .ఎన్ఆర్ఐ కావటం ఆర్థిక అండదండలు పుష్కలంగా ఉండటం నానికి గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube