మహేష్‌ బాబును పొగడలేదు.. నీకు అంత పొగరా? అడివి శేష్ కు అయన సూటి ప్రశ్న!

టాలీవుడ్ హీరో అడవి శేష్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట విలన్ పాత్ర తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అడవి శేష్ ఆ తర్వాత సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న.

 Tammareddy Bharadwaj Comments On Adivi Sesh About Mahesh Babu Over Major Movie ,-TeluguStop.com

విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు అడవి శేష్.క్షణం, గూడచారి లాంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు.

ఇదిలా ఉంటే అడవి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్.ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.26/11 హీరో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటీవ్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

ఇక ఈ సినిమాకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

మేజర్ సినిమా హిట్‌ అయిన సందర్భంగా హీరో అడవి శేష్‌ ని , దర్శకుడు శశి కిరణ్‌ని అలాగే ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.ఈ సందర్బంగా తమ్మారెడ్డి ప్రశ్నిస్తూ.

ఈ మధ్య ఏ సినిమా ఫంక్షన్‌ అయిన చీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన హీరోలను తెగ పొగుడుతూ.వారి డబ్బా కొడుతున్నారు.

మా దేవుడు, అది ఇది అంటూ పొగుడుతున్నారు.మరి నువ్వు.

మహేష్‌ బాబు గురించి ఎక్కడా ఒక్క మాట కూడా మ్టాలాడలేదు.సినిమా హిట్‌ అయ్యిందని పొగరా అని ప్రశ్నించగా.

ఆ విషయంపై స్పందించిన అడవి శేష్.

Telugu Adivi Shesh, Mahesh Babu, Tamma Bharadwaj-Movie

మహేష్‌ బాబుకి సినిమా నచ్చితేనే ప్రశంసిస్తారు.సినిమాలో ఆయనకు ఏం నచ్చిందో చెప్పి ప్రత్యేకంగా ప్రశంసిస్తారు.ఇక మేజర్‌ సినిమా టీజర్‌కు ముందు ఆయనకు సినిమా చూపించాం.

మూఈవీ కంప్లీట్‌ కాగానే.మహేష్‌ బాబు సైలెంట్‌గా బయటకు వెళ్లారు.

అప్పుడు మాకు టెన్షన్‌ వస్తోంది.సినిమా నచ్చిందా?.లేదా అర్థం కాలేదు.అప్పడు మహేష్ బాబు దగ్గరికి వెళ్లి చూస్తే.కంట్లో నుంచి నీరు కారుతుంది.అంతలా మేజర్ సినిమా ఆయనను టచ్‌ చేసింది.

ఆ తర్వాత ఆ ఎమోషన్ ని కంట్రోల్‌ చేసుకుని 2,3 గంటలు సేపు మాతో మాట్లాడారు అని చెప్పుకొచ్చాడు హీరో అడవి శేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube