మహమ్మారి కరోనా బారినపడిన రోగుల విషయంలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి కెసిఆర్ మాదిరిగా సీఎం స్టాలిన్ వ్యవహరిస్తున్నారు.మేటర్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడిన రోగులలో ధైర్యాన్ని నింపడం కోసం సీఎం కేసీఆర్ హైదరాబాదులో గాంధీ ఆసుపత్రిలో కరోనా వార్డును సందర్శించటం జరిగింది.
ప్రతి ఒక్క కరోనా పేషెంట్ దగ్గరికెళ్లి వారి బాగోగులు తెలుసుకొని పలకరించి వారి ఆత్మస్థైర్యాన్ని నింపారు.ఇప్పుడు ఇదే మాదిరిగా తమిళనాడు సీఎం స్టాలిన్ తమిళనాడు రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కోయంబత్తూరులో కరోనా రోగులను పరామర్శించారు.

కేసులు అదుపులోకి రాని కోయంబత్తూరు స్వయంగా మొట్టమొదటిసారి సీఎం స్టాలిన్ కరోన వార్డుల బాట పట్టారు.ఈ సందర్భంగా రోగులకు ఆత్మస్థైర్యాన్ని నింపి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.కోయంబత్తూర్ లో ఈ ఎస్ ఐ హాస్పిటల్ లో తాజాగా స్టాలిన్ పర్యటించడం జరిగింది.
ఈ సందర్భంగా కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవలు గురించి వైద్యుల దగ్గర అడిగి తెలుసుకున్నారు.
అదే రీతిలో కరోనా రోగుల దగ్గరకు వెళ్లి మరి వారికి అందుతున్న సేవలను కూడా అడిగి తెలుసుకున్నారు.ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం మీతోపాటు ఉందని రోగులకు స్టాలిన్ ఆత్మస్థైర్యం నింపారు.