చనిపోయిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడా? ఇది వినగానే మీరు ఆశ్చర్యపోయి ఉంటారు.కానీ రెవెన్యూ రికార్డుల్లో లాల్ బిహారీ మరణించిన మాట మాత్రం నిజం.
అయితే ఇప్పటికీ అతను ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అజంగఢ్ జిల్లాలోని ముబారక్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు.తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు ఎన్నికల్లో పోటీచేస్తున్నాడు.
దేశంలో వేలాది మంది సభ్యులున్న ‘మృతక్ సంఘ్’ వ్యవస్థాపకుడు లాల్ బిహారీ.రెవెన్యూ రికార్డుల్లో చనిపోయినట్లు మోసపూరితంగా పేర్కొన్న వారి కోసం పోరాటం సాగిస్తున్నాడు.
రెవెన్యూ రికార్డుల్లో ఆయన చనిపోయి ఇప్పటికి 21 ఏళ్లు.రెవెన్యూ రికార్డుల్లో 1976 జులై 30న ఆయన చనిపోయినట్లు ప్రకటించారు.
రెవెన్యూ రికార్డుల్లో చనిపోయిన వ్యక్తి లాల్ బిహారీ మాట్లాడుతూ.ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయిన వారికి న్యాయం చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.దీనిని నిరూపించుకునేందుకు కోర్టులో పోరాడి విజయం సాధించడం ద్వారా తాను బతికే ఉన్నాననేది రుజువైందన్నారు.18 ఏళ్ల పోరాటం తర్వాత 1994 జూన్ 30న తాను బతికున్నట్లు ప్రకటించారని.బతికుండగానే చనిపోయినట్లు ప్రకటించిన వాళ్లు యూపీలో వేల సంఖ్యలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.అతను తెలిపిన వివరాల ప్రకారం లాల్ బిహారీ చనిపోయినట్లు రికార్డులు సృష్టించి, బంధువులు అతని ఆస్తిని లాక్కోవానే ప్రయత్నం చేశారు.