జనరేటర్లతో టీ20 మ్యాచ్ నిర్వహణ.. బిల్లు ఏకంగా 1.4 కోట్లు..!

భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా( Australia ) మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నాలుగు మ్యాచులు పూర్తయిన సంగతి తెలిసిందే.ఇప్పటికే మూడు మ్యాచ్లలో గెలిచిన భారత్ మరో ఆడాల్సిన మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.

 T20 Match Management With Generators.. The Bill Is 1.4 Crores , T20 Match , Sur-TeluguStop.com

ఈ సిరీస్ లో భాగంగా నాల్గవ టీ20 మ్యాచ్ రాయపూర్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే.అయితే ఈ స్టేడియం కు గత కొన్నేళ్లుగా కరెంట్ బిల్ కట్టకపోవడంతో.

విద్యుత్ అధికారులు( Electricity authorities ) ఆ స్టేడియం కు విద్యుత్ నిలిపివేశారు.ఇక చేసేదేమీ లేక జనరేటర్ల సహాయంతో మ్యాచ్ ను నిర్వహించారు.

ఎలాంటి అంతరాయం కలుగకుండా మ్యాచ్ పూర్తయింది కానీ.జనరేటర్ల సహాయంతో మ్యాచ్ నిర్వహించడంతో మళ్లీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.స్టేడియంలో విద్యుత్ కోసం రూ.1.4 కోట్ల రూపాయల వరకు ఖర్చయింది.

ఈ స్టేడియానికి 3.1 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు పెండింగ్ లో ఉండడంతో ఐదేళ్ల క్రితమే ఈ స్టేడియం కు విద్యుత్ అధికారులు కరెంట్ చేయడం జరిగింది.స్టేడియం నిర్వాహకులు పెండింగ్ లో ఉండే బిల్లులు చెల్లించలేక.

జనరేటర్ల సహాయంతో మ్యాచ్ ను నిర్వహించారు.ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి భారత్ ( India )సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ నేడు బెంగుళూరు వేదికగా జరుగనుంది.పరువు కోసం ఆస్ట్రేలియా.

గెలుపు కోసం భారత్ బరిలోకి దిగనున్నాయి.చివరి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube