అన్ని ఆలోచించుకునే టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ పార్టీలో తిరుగుబాటు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది.పార్టీలో కనీస గౌరవం దక్కనప్పుడు ఇక కొనసాగడం సమయం వృథా అన్న ధోరణిలో ఉన్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
వాస్తవానికి ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీట్లలో తనకూ కేటాయించాలని కేటీఆర్‌ను కలిసి కోరినట్లుగా తెలుస్తోంది.ఇందుకు కేటీఆర్ ఇంత వరకు ఎలాంటి కబురు చేయకపోవడంతో అసలు విషయం బోధపడటంతో పార్టీలో తన స్థానమేంటో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు స్వామిగౌడ్. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
2012 జులైలో పదవి విరమణ చేసిన తర్వాత టీఆర్‌ఎస్ ద్వారా స్వామిగౌడ్ రాజకీయ అరంగేట్రం చేశారు.2013 ఫిబ్రవరిలో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియెజకవర్గం నుంచి పోటి చేసి గెలిచారు స్వామిగౌడ్.ఆపై తెలంగాణ ఏర్పాటు కావడం.టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో.తెలంగాణ శాసనమండలికి తొలి చైర్మన్ అయ్యారాయన.అయితే కొంతకాలంగా ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు.
దీంతో ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.టీఆర్‌ఎస్ లో తనకు అవకాశాలు రాకపోవచ్చునని భావించే.
రాజకీయ భవిష్యత్ దిశగా స్వామిగౌడ్ అడుగులు వేస్తున్నారని.అందుకే ఈ స్థాయిలో బయటపడ్డారని పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ పట్టించుకోకుంటే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొంతమంది నేతలు పేర్కొంటున్నారు.

గత మూడు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో స్వామిగౌడ్ వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరుగుతోంది.రేవంత్‌రెడ్డిని పొగిడిన నాటి నుంచి స్వామిగౌడ్‌పై రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి.కేసీఆర్ పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పించడం లేదని శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు, అంతిమంగా టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన స్వామిగౌడ్‌కు పార్టీలో ప్రాధాన్యం లేదు… ప్రభుత్వంలో చోటు లేదు అన్న విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.చేతిలో పదవి లేకపోవడం.
తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో టీఆర్‌ఎస్‌లో తనకు భవిష్యత్ లేదనే నిర్ధారణకు స్వామిగౌడ్ వచ్చినట్లు చెబుతున్నారు.ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ దీనికి బలం చేకూరుస్తున్నాయి.