మామయ్య బయోపిక్ సినిమాలో నటించాలని ఉంది... సుధీర్ బాబు కామెంట్స్ వైరల్!

సినీ నటుడు సుదీర్ బాబు( Sudheer Babu ) హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి చిత్రం మామ మశ్చేంద్ర( Mama Mascheendra) అమృతం ఫేమ్ నటుడు హర్షవర్ధన్(Harsha Vardhan) దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Sudheer Babu Interesting Comments About Krishna Biopic Movie, Sudheer Babu, Kris-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు సుదీర్ బాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుధీర్ బాబు కృష్ణ గారి గురించి కూడా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ఈ సినిమాలో మామయ్య కృష్ణ( Superstar Krishna ) గారి కోసం ఒక పాత్రను క్రియేట్ చేసాము.ఈ సినిమాలో మామయ్య కూడా నటిస్తానని చెప్పారు.అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మామయ్య గారు మరణించడం చాలా బాధాకరం అయితే ఆయన చేయాలనుకున్న ఈ పాత్రలో మరొకరు నటించిన ఆ సన్నివేశానికి ప్రాధాన్యత ఉండదన్న కారణంతోనే అసలు ఆ పాత్రను తొలగించేసామని సుధీర్ బాబు వెల్లడించారు.

ఇక నేను ఏ సినిమాలో నటించిన నా సినిమా విడుదలైన తర్వాత మామయ్య గారు ఆ సినిమా చూసి నాకు ఫస్ట్ ఫోన్ కాల్ చేసేవారు.సినిమాపై తన అభిప్రాయాన్ని నాకు తెలియజేసే వారు ఇకపై నాకు ఇలా చెప్పేవారు ఎవరూ కూడా ఉండరు.ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరు అంటూ సుధీర్ బాబు కృష్ణ గారిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు కృష్ణ గారి బయోపిక్( Krishna Biopic ) లో నటించే అవకాశం వస్తే చేస్తారా అంటూ ఈయనకు ప్రశ్న ఎదురవగా తప్పకుండా మామయ్య గారి బయోపిక్ సినిమాలో ఛాన్స్ వస్తే నటిస్తాను అంటూ ఈ సందర్భంగా కృష్ణ బయోపిక్ సినిమా గురించి కూడా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube