దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన దురదృష్టకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు.దౌల్తాబాద్ మండలంలోని సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తుండగా దాడి జరిగిందని తెలుస్తోంది.
అయితే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డికి సర్జరీ కొనసాగుతోందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారన్న మంత్రి హరీశ్ రావు సర్జరీ పూర్తయిన తరువాత అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు.అయితే రాజకీయాల్లో ఇటువంటి దాడులకు పాల్పడటం సరికాదన్నారు.
నారాయణ్ ఖేడ్ సభ ముగించుకుని కేసీఆర్ హైదరాబాద్ కు వస్తారని తెలిపారు.