బిగ్ బాస్ హౌజ్ ని ఇలా వాడేస్తున్నారేంటి..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6కి ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ ఆడియెన్స్ ని స్టార్ మా ఆడియెన్స్ ని అలరించాలని స్టార్ మా పరివార్ అంటూ సండే ఓ షో ఏర్పాటు చేశారు.మాములుగా అయితే సండే రోజు సినిమా వేస్తారు.కానీ నిన్న ఆదివారం మా సీరియల్ స్టార్స్ అందరిని తీసుకెళ్లి బిగ్ బాస్ హౌజ్ లో ఉంచి ఎంటర్టైన్ చేశారు.

 Star Maa Using Biggboss House For Seriyal Celebrities Star Maa Parivar , Amardee-TeluguStop.com

బిగ్ బాస్ హౌజ్ ని ఇలా కూడా వాడేస్తారా అన్న ఆలోచన వచ్చేలా చేశారు.సీరియల్ సెలబ్రిటీస్ ని 16 మందిని తీసుకొచ్చి ఒక్కరోజు బిగ్ బాస్ హౌజ్ లో ఉంచారు.

బిగ్ బాస్ ఆట తరహాలోనే వారికి కూడా టాస్కులు ఇచ్చారు.

అంతేకాదు వారిలో కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ చేశారు.

ఫైనల్ గా సీరియల్ స్టార్స్ వన్ డే బిగ్ బాస్ ఎపిసోడ్ లో తేజశ్వి, అమర్ దీప్ ఫైనల్ 2 గా నిలబడగా సీరియల్ స్టార్ సెలబ్రిటీస్ ఓటుతో అమర్ దీప్ వన్ డే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు.బిగ్ బాస్ అంటే ఓ సీరియస్ ఆట అన్న ఆలోచన ఉండగా అలా కాకుండా సీరియల్ సెలబ్రిటీస్ ని తెచ్చి బిగ్ బాస్ ఆటని సరదాగా ప్లాన్ చేశారు.

అయితే ఇది ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అనిపించినా ఆ గేమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆడియెన్స్ కి తగ్గుతుందని మాత్రం చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube