ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కి ఈ ఏడాది విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్2 ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించింది.ఈ సినిమాకు 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
కేజీఎఫ్2 సినిమా సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.ఇప్పటికే సలార్ మూవీ షూటింగ్ 40 శాతం పూర్తి కాగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి అనుకున్న తేదీకి సినిమాను థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
![Telugu Kgf, Prabhas, Prashanth Neel, Salaar, Sruthi Hasan, Tollywood-Movie Telugu Kgf, Prabhas, Prashanth Neel, Salaar, Sruthi Hasan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/06/tollywood-kgf-2-prashanth-neel-sruthi-hasan.jpg)
ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎన్నో సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.సలార్ కోసం ప్రభాస్, శృతి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సలార్ కేజీఎఫ్2 కలెక్షన్లను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
సలార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది.ఆదిపురుష్ సినిమాతో పోల్చి చూస్తే ఈ సినిమాపైనే ఎక్కువగా అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.