గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల బడ్జెట్, మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగింది.ఇతర భాషలలో, విదేశాలలో కథ, కథనం అద్భుతంగా ఉన్న తెలుగు సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయి.
స్టార్ ప్రొడ్యూసర్లు సైతం కథను నమ్మి వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి ముందుకు వస్తున్నారు.అయితే కరోనా వల్ల స్టార్ ప్రొడ్యూసర్లు ఫైనాన్స్ తెచ్చి నిర్మించిన సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
500 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి విడుదలకు సిద్ధమైన ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ నాలుగుసార్లు మారింది.ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతో భారీ మొత్తంలో చెల్లించి ఆర్ఆర్ఆర్ హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత దానయ్యను వడ్డీతో సహా డబ్బులు వెనక్కు ఇవ్వాలని కోరారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం నిర్మాత దానయ్య 180 కోట్ల రూపాయలు ఫైనాన్స్ తెచ్చారని సమాచారం.
ఫైనాన్షియర్ల నుంచి నిర్మాత దానయ్యకు ఒత్తిడి పెరగడంతో ఆ డబ్బుకు తాను షూరిటీ ఉంటానని రాజమౌళి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
జరుగుతున్న ప్రచారం గురించి అటు దానయ్య కానీ రాజమౌళి కానీ అధికారికంగా స్పందించే ఛాన్స్ అయితే లేదు.అయితే కష్టాల్లో ఉన్న నిర్మాతకు సాయం చేయడానికి రాజమౌళి ముందుకు వచ్చాడనే విషయం తెలిసి నెటిజన్లు జక్కన్నను ప్రశంసిస్తున్నారు.

నిర్మాత నష్టపోకుండా సినిమాలను తెరకెక్కించి ఆ సినిమాలతో విజయాలను అందుకునే రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేస్తారని చరణ్, తారక్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా కొరకు రాజమౌళి రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.ఆర్ఆర్ఆర్ పాటలకు మరీ పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయినా సినిమా రిలీజైన తర్వాత ఆ పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని ఆర్ఆర్ఆర్ టీం భావిస్తోంది.