జబర్దస్థ్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ ఆ షోలో స్కిట్ల మధ్యలో కొన్నిసార్లు పంచ్ లు, కౌంటర్లు వేస్తూ స్కిట్ ను మరో లెవెల్ కు తీసుకెళుతుందన్న సంగతి తెలిసిందే.తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్ట్ ప్రోమోలో రష్మీ వేసిన కౌంటర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.“మరీ అంత కామంగా చూడకు ప్రేమతో చూడు” అంటూ ఇమ్మాన్యుయేల్ కు వేసిన కౌంటర్ స్కిట్ లో భలే పేలింది.
ఎక్స్ట్రా జబర్దస్త్ లో గతంలో అవినాష్, కెవ్వు కార్తీక్ కలిసి స్కిట్లు వేయగా అవినాష్ బిగ్ బాస్ షోకు వెళ్లడంతో ఇప్పుడు స్కిట్ భారమంతా కార్తీక్ పైనే పడింది.
దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించడం కోసం కార్తీక్ స్కిట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ స్కిట్ హిట్ అయ్యేలా చేస్తున్నాడు.లాస్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో స్టార్ మహిళ షోలోకి వెళ్లి కెవ్వు కార్తీక్, ఇమ్మాన్యుయేల్ చేసిన స్కిట్ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది.
ఈ నెల 30వ తేదీన ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా అందులో ఇమ్మాన్యుయేల్ పెళ్లి చూపులకు వెళతాడు.పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురును ఇమ్మాన్యుయేల్ అదోలా చూడటంతో వెంటనే రష్మీ ” రేయ్.
వెధవా మరీ అంత కామంగా చూడకు ప్రేమతో చూడు” అని అంటుంది.ఆ కౌంటర్ కు జడ్జీలు రోజా, మనో పగలబడి నవ్వారు.
రష్మీ స్క్రిప్ట్ లో భాగంగా చెప్పిందో లేక సాధారణంగా కౌంటర్ వేసిందో తెలీదు కానీ కౌంటర్ మాత్రం బాగుంది.
మరోవైపు కొన్ని రోజుల క్రితం రష్మీ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.
ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్న రష్మీ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని తెలుస్తోంది.రష్మీకి కరోనా సోకడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ షోల షూటింగ్ లు వాయిదా పడినట్టు తెలుస్తోంది.