వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే మీ జుట్టు రెండింతలు అవుతుంది!

సాధారణంగా చాలా మంది త‌మ జుట్టు సన్నగా ఉందని తెగ బాధపడుతూ ఉంటారు.వీరిలో హెయిర్ ఫాల్ ఉంటుంది.

 Follow This Remedy Once A Week For Double Hair Growth!, Hair Growth, Thick Hair,-TeluguStop.com

కానీ హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది ఉండదు.దీంతో ఊడే జుట్టు ఊడుతుంది.

అయితే కొత్త జుట్టు రాదు.ఫలితంగా జుట్టు పల్చగా మారిపోతుంది.

ఇటువంటి జుట్టుతో మీరు కూడా సతమతం అవుతున్నారా.? అయితే ఇకపై చింతే వద్దు.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని వారానికి ఒక్కసారి పాటిస్తే చాలు మీ జుట్టు రెండింతలు అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

Telugu Aloevera Gel, Care, Care Tips, Fall, Pack, Hibiscus, Remedy, Long, Thick-

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు రెబ్బలు వేపాకు వేసుకోవాలి.అలాగే నాలుగు నుంచి ఐదు మందారం ఆకులు( Hibiscus Leaves ) తుంచి వేసుకోవాలి.చివరగా మూడు రెబ్బలు కరివేపాకు మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

Telugu Aloevera Gel, Care, Care Tips, Fall, Pack, Hibiscus, Remedy, Long, Thick-

కొద్ది రోజుల్లోనే పల్చగా ఉన్న మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు కుదుళ్లు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.దాంతో హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో కురులు సిల్కీగా షైనీ గా( Silky and Shiny Hair ) మెరుస్తాయి.చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.స్కాల్ప్ ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube