పైసా ఖర్చు లేకుండా పసుపు దంతాలకు గుడ్ బై చెప్పవచ్చు.. ఎలాగంటే?

సాధారణంగా కొందరి దంతాలు( Tooth ) బాగా గార పట్టి పసుపు రంగులో ఉంటాయి.ఇటువంటి దంతాలు క‌లిగిన వారు కొంత అసౌకర్యానికి గురవుతుంటారు.

 Best Way To Say Goodbye To Yellow Teeth!, Yellow Teeth, Home Remedy, Teeth White-TeluguStop.com

ఇతరులతో మాట్లాడేందుకు, నలుగురిలో నవ్వేందుకు ఇబ్బంది పడుతుంటారు.ఈ క్రమంలోనే దంతాలను తెల్లగా మార్చుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.

కొందరైతే వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పసుపు దంతాలకు గుడ్ బై చెప్పవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Remedy, Oral, Teeth Remedy, Yellow Teeth-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ), హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు ఆవ నూనె, మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ టూత్ పేస్ట్( Tooth Paste ) ను వేసి అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా తోముకోవాలి.

ఆపై వాటర్ తో దంతాలను నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ప్ర‌తి రోజు ఈ విధంగా చేస్తే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలు( Yelloww teeth ) కొద్ది రోజుల్లోనే తెల్లగా ముత్యాల మాదిరి మెరుస్తాయి.

Telugu Tips, Remedy, Oral, Teeth Remedy, Yellow Teeth-Telugu Health

అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల చిగుళ్ళ నుండి రక్తస్రావం, చిగుళ్ల వాపు( Cavities ) వంటి సమస్యలు దూరం అవుతాయి.దంతాలు దృఢంగా మారతాయి.నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.కాబట్టి తెల్లటి మెరిసే దంతాలు కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube