Hansika wedding : హన్సిక చేసిన ఈ పనికి దండం పెట్టాల్సిందే.. పేదపిల్లలే అతిథులుగా?

స్టార్ హీరోయిన్ హన్సిక పెళ్లి గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే.తెలుగు, తమిళ భాషల్లో చాలా సంవత్సరాల పాటు సక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించిన హన్సిక ఫ్రెండ్ భర్త అయిన సోహైల్ ను పెళ్లి చేసుకున్నారు.

 Star Actress Hansika Great In That Matter Details Here Goes Viral , Actress Hans-TeluguStop.com

చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక దేశముదురు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.అయితే సాధారణంగా సినిమా సెలబ్రిటీల పెళ్లి అంటే పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు గెస్ట్ లుగా వస్తారు.

అయితే హన్సిక మాత్రం తన పెళ్లికి నిరుపేద పిల్లలను గెస్ట్ లుగా ఆహ్వానించడం హాట్ టాపిక్ అవుతోంది.హన్సిక పెళ్లికి నిరుపేద పిల్లలు అతిథులుగా రావడం పెళ్లికి వచ్చిన గెస్ట్ లను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పేదపిల్లలను అతిథులుగా ఆహ్వానించాలంటే గొప్ప మనస్సు ఉండాలని ఆ గొప్ప మనస్సు హన్సికకు ఉందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Telugu Actress Hansika, Apple, Hansika, Poor, Sohail-Movie

హన్సిక గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే.సేవా కార్యక్రమంలా పెళ్లి వేడుకను జరుపుకున్న హన్సిక మనసు కూడా అందంగానే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.హన్సిక చేసిన ఈ పని గురించి తెలిసి చేతులెత్తి దండం పెట్టాలని అనిపిస్తోందని నెటిజన్లు చెబుతున్నారు.

హన్సిక మంచితనానికి ఫిదా అయ్యామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Actress Hansika, Apple, Hansika, Poor, Sohail-Movie

హన్సిక వయస్సు ప్రస్తుతం 31 సంవత్సరాలు కాగా పెళ్లి తర్వాత సినిమాల్లో హన్సిక కెరీర్ ను కొనసాగిస్తారో లేదో చూడాలి.ఆపిల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హన్సిక సోహైల్ ను ఎంతగానో ఇష్టపడ్డారని ఈ రీజన్ వల్లే ఆమె అతనిని పెళ్లి చేసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హన్సిక పారితోషికం ప్రస్తుతం 2 కోట్ల రూపాయలుగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube