బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించిన శ్రీలంక.. సూపర్-4లో తొలి విజయం..!

తాజాగా జరిగిన ఆసియా కప్ టోర్నీ సూపర్-4 మ్యాచ్ లో బంగ్లాదేశ్( Bangladesh ) పై శ్రీలంక రికార్డ్ విజయం సాధించింది.కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 257 పరుగులు చేసింది.

 Sri Lanka Defeated Bangladesh First Win In Super-4 , Sri Lanka Defeated Banglad-TeluguStop.com

శ్రీలంక బ్యాటర్ లను బంగ్లాదేశ్ బౌలర్లు బాగానే కట్టడి చేశారు.శ్రీలంక బ్యాటర్లైన సదిర సమర విక్రమ్ 93, కుషాల్ మెండీస్ 50, పాతుమ్ నిస్సంక 40 పరుగులతో అద్భుతమైన కీలక ఇన్నింగ్స్ ఆడారు.

ఈ ముగ్గురు బ్యాటర్లు రాణించడం వల్ల శ్రీలంక జట్టు 257 పరుగులను నమోదు చేయగలిగింది.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు.బంగ్లాదేశ్ ఓపెనర్లైన మహమ్మద్ నయీమ్ 21, మెహదీ హసన్ మిరాజ్ 28 పరుగులకే పెవిలియన్ చేరారు.శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక( Dasun Shanaka ) కీలకమైన సమయాలలో మూడు వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

గెలుపు కోసం చివరి వరకు పోరాడిన బంగ్లాదేశ్ జట్టు లక్ష్యానికి 21 పరుగుల దూరంలోనే కుప్పకూలింది.దీంతో శ్రీలంక సూపర్-4 దశలో మొదటి విజయం సాధించింది.

బంగ్లాదేశ్ జట్టు దాదాపుగా ఆసియా కప్ ( Asia Cup )టోర్నీ నుండి నిష్క్రమించినట్టే.బంగ్లాదేశ్ సూపర్-4 దశలో ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఘోరంగా ఓడింది.ఇక ఆడాల్సిన మ్యాచ్ ఒకటే మిగిలి ఉంది.పాకిస్తాన్, శ్రీలంక జట్లు సూపర్-4 దశలో తమ తొలి మ్యాచ్లలో విజయం సాధించాయి.బంగ్లాదేశ్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.పాకిస్తాన్, శ్రీలంక జట్లు చెరో రెండు మ్యాచులు, భారత్ మూడు మ్యాచ్లు, బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube