ఐటీ దాడుల్లో ఎలాంటి అక్రమ ఆస్తులు దొరకలేదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు.దాదాపు మూడు రోజుల పాటు నిర్వహించిన దాడులలో అధికారులకు తాను అన్ని రకాలుగా సహకరించానని చెప్పారు.
సౌత్ ఆఫ్రికా మైనింగ్ అబద్ధమని పేర్కొన్నారు.కావాలనే కుట్ర పూరితంగా తమ ఇళ్లపై, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారని ఆరోపించారు.
ఇటువంటి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.