అసలు ఇది మనం చదివిన చూసిన రామాయణమేనా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్( Adipurush ) ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7000 థియేటర్స్ లో విడుదల అయ్యింది.ఇక ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

 Is This Actually The Ramayana We Have Read And Seen, Adipurush, Seethamma Ravana-TeluguStop.com

అయినా సరే మొదటి రోజే ఈ సినిమా రికార్డులను కొల్లగొట్టింది .రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్( Om Rauth ) తెరక్కించిన ఈ మూవీపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు .అసలు ఇది రామాయణం ఆధారంగానే తెరకేక్కిన్చారా .అసలు ఇది వాల్మీకి రామాయణమేనా అని ప్రశ్నిస్తున్నారు .అంతేకాక తొమ్మిది ప్రశ్నలు కూడా సంధిస్తాన్నారు .

Telugu Adipurush, Ramayana Read, Om Rauth, Seshu-Movie

వాల్మీకీ రామాయ‌ణంలోని( Valmiki’s Ramayanam ) కొన్ని కీల‌క అంశాల్ని ఓం రౌత్ త‌ప్పుదోవ ప‌ట్టించాడని అంటున్నారు .రామ ల‌క్ష్మ‌ణుల ముందే సీత‌ని రావ‌ణుడు ఎత్తుకెళ్లిన‌ట్టు సినిమాలో చూపించారు.రాముడి స‌మ‌క్షంలో సీత‌ని అప‌హ‌రించిన‌ట్టైతే.

 Is This Actually The Ramayana We Have Read And Seen, Adipurush, Seethamma Ravana-TeluguStop.com

రాముడి శ‌క్తి, ధైర్యం, తెగువ‌, సీత ప‌ట్ల ప్రేమ ఏమైన‌ట్టు.అసలు ఇది వాల్మీకి రామాయ‌ణంకి విరుద్ధం అంటున్నారు .ఇక ల‌క్ష్మ‌ణుడ్ని శేషూ… అని రాముడు పిలుస్తాడు.ల‌క్ష్మ‌ణుడికి ర‌క‌ర‌కాల పేర్లున్నా… అందులో శేషు లేదు.

రాముడ్ని రాఘ‌వ అని పిలుచుకొంటారు.సీత‌కి జాన‌కిగా అభివ‌ర్ణిస్తారు.

కానీ ల‌క్ష్మ‌ణుడ్ని శేషూ అన‌డ‌దం ఏమిటి అని అంటున్నారు .ఇక లంక‌ని ఓం రౌత్ భూత్ బంగ్లాల కంటే దారుణంగా చూపించడంపై విమర్శలు వస్తున్నాయి అలాగే లంకలో ఉన్న సీత‌మ్మ రావ‌ణుడ్ని( Seethamma Ravana ) గ‌డ్డిపోచ‌ని చూసిన‌ట్టు చూసింది.

Telugu Adipurush, Ramayana Read, Om Rauth, Seshu-Movie

గ‌డ్డిపోచ‌తోనే మాట్లాడింది.అయితే ఇక్కడ మాత్రం సీత‌కూ, రావ‌ణుడికీ మ‌ధ్య ముఖాముఖీ మాటలు ఉండటంపై విమర్శలు ఉన్నాయి .అలాగే కుంభ‌క‌ర్ణుడికీ, ఆంజ‌నేయడికీ మ‌ధ్య ఓ ఫైట్ సృష్టించాడు రౌత్‌.ఇది రామాయ‌ణంలో అసలు లేనే లేదు అంటున్నారు .ఇక రాముడి వ‌స్త్ర‌ధార‌ణ కూడా సరిగా లేదు.అలాగే రావనుజ్డు గొప్ప శివ‌భ‌క్తుడు.

అయినా స‌రే… నుదుట‌న బొట్టు లేదు.సీత‌మ్మ వస్త్రధారణపై కూడా విమ‌ర్శ‌లు ఉన్నాయి.

అలాగే హనుమంతుడితో… మాస్ డైలాగులు చెప్పించారు .అది ఆడియెన్స్ కి నచ్చలేదు .ఇక రావ‌ణుడు స‌ర్పాల‌తో మ‌సాజ్ చేసుకొంటున్న సీన్ మరీదారుణం .ఇక చివరగా రావ‌ణుడి త‌పస్పు మెచ్చి బ్ర‌హ్మ‌ ప్రత్యక్షమైన సందర్భంలో … ఎక్క‌డా బ్ర‌హ్మ‌లా ఆ పాత్ర కనిపించదు.దీనితో అసలు ఇది రామాయణమేనా .లేక ఆ పేరు చెప్పి వాళల్కి తోచింది తీశారా అన్న విమర్శలు ఆడియెన్స్ నుంచి వస్తున్నాయి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube