సమంత( Samantha ) మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.అలాంటి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కానీ సమంత మాత్రం గత ఏడాది కాలంగా బాలీవుడ్ లో సిటాడెల్( Citadel ) అనే సిరీస్ నే చేస్తోంది.హిందీ వెబ్ సిరీస్ ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి అవ్వక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సమంత కు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు దక్కించుకోవాలి.కానీ ఈమె మాత్రం మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా హీరోల మాదిరిగా సినిమా ను చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు.
తెలుగు లో ఈమె ఖుషి సినిమా లో నటిస్తోంది.
విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) హీరోగా రూపొందుతున్న ఖుషి సినిమా( Khushi ) చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.ఇప్పటికే సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయ్యింది.రెండు మూడు వారాల షూటింగ్ తో మొత్తం టాకీ పార్ట్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయినా కూడా సమంత ఇప్పటి వరకు తదుపరి సినిమా యొక్క హడావుడి మొదలు పెట్టలేదు.తెలుగు లో సమంత కొత్త సినిమా లకు సైన్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
అసలు సమంత ముందు ముందు అయినా తెలుగు లో సినిమా లు చేసేందుకు ఆసక్తి చూపిస్తుందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమంత యొక్క క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు చాలా మంది స్టార్ ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.కానీ ఆమె మాత్రం ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపించడం లేదు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.సమంత యొక్క సినిమా లు హిందీ లో కూడా ఆడియన్స్ కోరుకుంటున్నారు.
కానీ అక్కడ కూడా సినిమా ను కూడా సమంత కమిట్ అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు.